కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ను కలిసిన తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్

సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 26: తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా నూతన కార్యవర్గం ఎన్నుకోబడిన తరువాత బుధవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్ కార్యదర్శి కోమండ్ల విక్రమ్ రెడ్డి సహ అధ్యక్షులు నిమ్మ సురేందర్ రెడ్డి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైనటువంటి తెలంగాణ ఆఫీసర్స్ యూనియన్ సిద్దిపేట జిల్లా నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, జిల్లాలో ఉద్యోగాలు అందరూ కూడా బాగా పనిచేయాలని, ఉద్యోగులకు ఏ సమస్య ఉన్నా కూడా అసోసియేషన్ మా దృష్టికి తీసుకొస్తే దాని పరిష్కారం దిశగా ఆలోచిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గ్యాదరి పరమేశ్వర్ కార్యదర్శి విక్రం రెడ్డి మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా ఎంతో ప్రత్యేకమైనదని సిద్దిపేట జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా అని జిల్లాలో ఉన్న ఉద్యోగులందరూ బాగా పనిచేయాలని సిద్దిపేట జిల్లాలో అందరూ కూడా బాగా పని చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి అవార్డులలో సిద్దిపేట జిల్లాకే ఎక్కువ అవార్డు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ అలాగే నూతనంగా కారుణ్య నియామకాలపై సూపర్ న్యూమరిక్ పోస్టులు 64 సిద్దిపేట జిల్లా కేటాయించడం జరిగిందని దాన్ని త్వరలో భర్తీ చేయాలని కలెక్టర్ కి విన్నవించడం జరిగిందని అతి త్వరలో నియామకలన్నీ కూడా భర్తీ చేస్తామని కలెక్టర్ సూత్రప్రాయంగా తెలియజేశారని, వారికి సిద్ధిపేట టీఎన్జీవోస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ టీఎన్జీవోస్ యూనిట్ అధ్యక్షులు నరేష్ కార్యదర్శి నగేష్ సిద్దిపేట యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు శశిధర్, పవన్ కుమార్ కలెక్టరేట్ సహాధ్యక్షులు సుమన్ ,కోశాధికారి సాయి, వెంకటేశ్వర్లు శ్రీకాంత్ మెడికల్ ఫోరం అధ్యక్షులు శ్రీధర్ ఉపేందర్, హరీష్ రత్నమ్మ, నాగజ్యోతి, భార్గవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *