గోమూత్రంతో శుభ్రం చేసిన కాంగ్రెస్
బెంగళూరు,మే22 : కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ అవినీతి పాలన ముగిసిందంటూ ఆ రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం ఆవు మూత్రంతో విధాన సౌధను శుద్ధి చేశారు. శనివారం సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం విధానసౌధ ప్రాంగణాన్నిఆవు మూత్రంతో శుభ్రం చేశారు. బీజేపీ తన అవినీతితో అసెంబ్లీని కలుషితం చేసిందని కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపించింది.
మే 20వతేదీన డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ కర్ణాటక అధ్యక్షుడు డీకే శివకుమార్ ఈ ఏడాది జనవరిలో విధానసౌధ ని గోమూత్రంతో శుభ్రపర్చే సమయం వచ్చిందని చెప్పారు. మేం విధాన్ సౌధను శుభ్రం చేయడానికి కొంత డెటాల్తో వస్తాం. నా దగ్గర శుద్ధి చేయడానికి కొంత ఆవు మూత్రం కూడా ఉందని శివకుమార్ చెప్పారు. బీజేపీ హయాంలో అవినీతితో అసెంబ్లీ కలుషితమైందని శివకుమార్ ఆరోపించారు.కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రెండోసారి, డిప్యూటీగా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు.




