కర్ణాటక బిజెపి ఎమ్మెల్యేను  సన్మానించిన ప్రజాప్రతినిధులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 21 : ఆమనగల్లు మండల బిజెపి కార్యాలయంలో కల్వకుర్తి నియోజకవర్గానికి బీజేపీ ఇంచార్జి,  కర్ణాటక రాష్ట్ర, మంగుళూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ భరత్ శెట్టి, మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి తో కలిసి ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మున్సిపాలిటీ పాలకవర్గం, బిజెపి బూతు, మండల ఇంచార్జ్ లతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పలు విషయాలపై చర్చించారు. అనంతరం చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్లు చెక్కల లక్ష్మణ్, జ్యోతి నరసింహ, లతో కలిసి భరత్ శెట్టిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చెన్నకేశవులు, విక్రమ్ రెడ్డి, విజయ్ కృష్ణ, దొడ్డు కృష్ణ, గోరేటి నరసింహ, సుజాత, కోఆప్షన్ లు గజ్జె యాదమ్మ, పాష, మెడిశెట్టి శ్రీధర్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *