కరెంట్‌ ‌సమస్యలు పరిష్కరించండి

  • అంబర్‌పేటలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి పాదయాత్ర
  • అధికారుల గైర్హాజరుపై మండిపాటు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 23 : తన సొంత నియోజకవర్గమైన అంబర్‌ ‌పేటలో కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి పాదయాత్ర చేపట్టారు. పటేల్‌ ‌నగర్‌, ‌ప్రేమ్‌ ‌నగర్‌ ‌ప్రాంతాల్లో కిషన్‌ ‌రెడ్డి పర్యటించారు. పాదయాత్రలో స్థానిక అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులు తమ సమస్యలను కిషన్‌ ‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. ఇదే విషయంపై మాట్లాడుదామంటే సంబంధిత అధికారులెవరూ అందుబాటులో లేకపోవడంతో కిషన్‌ ‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాము సమస్యల పరిష్కార కోసం ప్రజల్లో తిరుగుతుంటే వి• అధికారులు ఎక్కడ ఉన్నారంటూ ఉన్నతాధికారులను ఫోన్‌ ‌లో కిషన్‌ ‌రెడ్డి మందలించారు. వెంటనే కరెంటు సమస్యను పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించారు. బస్తీల్లో వాటర్‌ ‌పైప్‌ ‌లైన్‌ ‌కోసం రోడ్డు మధ్యలో తీసిన కాలువలను వెంటనే లెవలింగ్‌ ‌చేయాలని కోరారు. పైప్‌ ‌లైన్‌ ‌కోసం తీసిన కాలువలు గుంతలుగా మారడంతో రోడ్డుపై నడవలేకపోతున్నామని స్థానికులు కిషన్‌ ‌రెడ్డికి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *