కపిలేశ్వరాలయంలో వైభవంగా తెప్పోత్సవం

తిరుపతి,జనవరి5 : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న తెప్పోత్సవాల్లో భాగంగా శ్రీ కామాక్షి అమ్మవారు తెప్పలపై భక్తుల దర్శనం ఇచ్చారు. రాత్రి తెప్పోత్సవం వేడుక వైభవంగా జరిగింది. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై అమ్మవారు కపిలతీర్థం పుష్కరిణిలో ఏడు చుట్లు తిరిగారు.

పెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు.ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్ర బాబు, ఏఈవో పార్థసారథి, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *