కనకదుర్గమ్మకు శ్రీశైలం తరఫున సారె

విజయవాడ, జూలై 8 : ఆషాఢమాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారికి, శ్రీమల్లేశ్వరస్వామివారికి ఆలయ ప్రాంగణంలోని గణపతిస్వామి, కుమారస్వామికి శ్రీశైలం దేవస్థానం తరుఫున సారెను సమర్పించారు. శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు శ్రీరెడ్డివారి చక్రపాణిరెడ్డి దంపతులు, దేశస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్‌ ‌లవన్న దంపతులు ధర్మకర్తల మండలి సభ్యులు గురుమహాంతు సారెను సమర్పించిన వారిలో ఉన్నారు.

ఉమామహేశ్‌, ఎం ‌విజయలక్ష్మి, సూరిశెట్టి మాధవీలత తదితరులు సారెను సమర్పించారు.అంతకు ముందు సారెతో కనకదుర్గ అమ్మవారి ఆలయానికి చేరుకున్న వీరికి దుర్గామల్లేశ్వర దేవస్తానం కార్యని ర్వహణా ధికారిణి భ్రమరాంబ, దేవ స్థానం ధర్మకర్మల మండలి సభ్యులు బుద్దా రాంబాబు తదితరులు సంప్రదా య బద్దంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీశైలం ఆలయ సభ్యులకు శేషవస్త్రాలు , ప్రసాదాలు, అమ్మవారి చిత్రప టాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ విభాగ సహాయ కార్యనిర్వహణాధికారి ఎం . హరిదాసు, అమ్మవారి ప్రధానార్చకులు మార్కం డేయ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *