ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 2 : జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతి వేడకలను కడ్తాల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కడ్తాల మండల జడ్పిటిసి దశరథ్ నాయక్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ మరియు కడ్తాల, ఆమనగల్లు ఉమ్మడి మండలాల పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ లు హాజరై స్థానిక గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారతదేశానికి గ్రామాలే పట్టుకోమ్మలని గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని గాంధీ గారు భావించారు. అదేవిధంగా అహింస అనే ఆయుధాన్ని శాంతి అనే నినాదాన్ని తీసుకొని అఖండ భారతావానికి స్వతంత్రం తెచ్చిన మహనీయులని గుర్తుచేశారు. అనంతరం పండ్లు మిఠాయిలు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో మండల రైతు కోఆర్డినేటర్ జోగు వీరయ్య, వైస్ ఎంపీపీ ఆనంద్, స్థానిక సర్పంచ్ ఎల్ ఎన్ రెడ్డి , ఉపసర్పంచ్ రామకృష్ణ, గ్రామ వార్డు సభ్యులు గణేష్, మహేష్ బిక్షపతి,రామచంద్రయ్య, నరేందర్ రెడ్డి, యువజన సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు ఎర్రోళ్ల రాఘవేందర్, బీసీ సంఘం అధ్యక్షులు పిప్పళ్ళ వెంకటేష్, మండల యూత్ అధ్యక్షులు ఇర్షాద్, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు క్యామ వెంకటేష్, కొప్పు కృష్ణ, కుకుట్ల శీను, సిద్దిగారి సురేష్, సత్యం, రాయి కంటి సురేష్, మరియు రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు గంప శ్రీనివాస్ గుప్తా, బిక్కుమాండ్ల మోహన్, కడ్తాల్ మండల ఆర్య వైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు వాసుదేవులు, వెంకటయ్య, లక్ష్మణ్, గుద్దేటి సత్యనారాయణ, రాజశేఖర్, రవి, మండల ప్రధాన కార్యదర్శి బి. రామకృష్ణ, అర్థం రవికుమార్, మండల ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు వీరేంద్ర గుప్తా, ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఊలే వెంకటయ్య, నరేందర్ బొగ్గారపు వీరేష్, సంధ కిరణ్, వీరేష్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
కడ్తాలలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు





