కంటి ముందు కనిపించే నేత హరీష్ రావు

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 15: కండ్ల ముందు కనిపించే అభివృద్ధి… ప్రతి నిత్యం ప్రజల కోసం ఇంటి ముందు  కనిపించే నాయకుడు
మంత్రి తన్నీరు హారీష్ రావు అని, ఈసారి మెజార్టీ రికార్డు తిరగ రాద్దామని కౌన్సిలర్ కొండం కవిత సంపత్ రెడ్డి అన్నారు బుధవారం ఆమె హౌసింగ్ బోర్డ్, చైతన్యపురి కాలనీ లలో మహిళలతో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కరపత్రాలు, సిద్దిపేట అభివృద్ధి మీద రూపొందించిన ప్రగతి పుస్తకాలు పంపిణీ చేశారు. నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న మంత్రి ని ఆశీర్వదించాలని కోరారు. లక్షన్నర భారీ మెజార్టీ సాధనలో మనం భాగస్వామ్యం అవుదామని పిలుపునిచ్చారు. సిద్దిపేట ను దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చి మన గౌరవాన్ని మరింత పెంచిన హరిశ్ రావుకు మనం ఎంత చేసిన  తక్కువేనని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో వచ్చే  ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దని, మరోసారి అభివృద్ధి కి ఓటు వేద్దామని కోరారు. ప్రజల కష్టసుఖాల్లో  పాలు పంచుకున్న మంత్రి హరీశ్ రావు ప్రజల మనిషి అని కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *