• 50 రోజులు నా గురించి కష్టపడండి…5 ఏళ్ళు మీ సేవలో ఉంటా..
• సిద్దిపేటలో 17న సీఎం కేసీఆర్ ప్రగతి-ప్రజా ఆశీర్వాద సభ..
• లక్ష మందితో నిర్వహణకు ఏర్పాట్లు
• సిద్దిపేట సిద్దించిన కలలతో అపూర్వ స్వాగతం పలుకుదాం..
• జనసమీకరణ, సభా సమాయత్తంపై పార్టీ శ్రేణులకు మంత్రి హరీష్ రావు దిశానిర్దేశం
సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : సిద్ధిపేట నాటి ఉద్యమానికి, నేటి అభివృద్ధికి దీక్సుచి అని..నేడు సిద్దిపేట జిల్లా…సాగు నీటి కల గోదావరి జలాలు, రైలు కలలు నెరవేరాయ్.. నాడు నినాదాలు ఉన్న పనులు నేడు నిజం చేసి పురిటి గడ్డ ను పుణితం చేసిన కారణజన్ముడు మన సీఎం కేసీఆర్ అని..మన సిద్ధిపేట కు అన్ని సిద్దించాయని ఈ సందర్భంగా 17న సీఎం కేసీఆర్ సిద్ధిపేట ఎన్నికల శంఖారవాన్ని పూరించనున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు.
మంగళవారం సాయంత్ర సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సీఎం కేసీఆర్ సభ జనసమీకరణ పై సన్నాహక సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…అక్టోబర్ 17న సిద్దిపేటలో సాయంత్రం సీఎం కేసీఆర్ సభ ఉంటుందని, లక్ష మంది తో ‘ప్రగతి-ప్రజా ఆశీర్వాద సభ’ నిర్వహిస్తుమని చెప్పారు. సిద్దిపేట నాడు ఉద్యమంలో..నేటి అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచామని చెప్పారు.. సీఎం కేసీఆర్ ఆశీస్సులు సిద్దిపేట ప్రజల ఆశీర్వాదం తో 6 సార్లు గెలిపించారు. ఆ గెలుపుకు ప్రజల ఆలోచనలను అనుగుణంగా అభివృద్ధి చేసాము, అభివృద్ధి కోనసాగాలని కొరారు.. సిద్ధిపేట ప్రజల కలలను సాకారం అయిన వేళ లక్ష మందితో అద్భుతమైన అపూర్వ స్వాగతం పలకాలని అందుకోసం మండలాల వారీగా జన సమీకరణపై సమాయత్తం కావాలని కోరారు.
50 రోజులు నా గురించి కష్టపడండి…5 ఏళ్ళు మీ సేవలో ఉంటా..
వచ్చే ఎన్నికల్లో 50 రోజులు కష్టపడండి… 5 ఏళ్ళు మీ సేవలో ఉంటానని మంత్రి హరీష్ రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ …గత ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీ తో దేశ స్ధాయి లో సిద్దిపేట గౌరవాన్ని పెంచారని ఆదిశగా అభివృద్ధి చేసి జాతీయ స్థాయిలో సిద్దిపేట ప్రతిష్టను పెంచానని చెప్పారు.. సిద్దిపేట ప్రజలే నా కుటుంబ సభ్యులుగా , నేను సిద్దిపేట ప్రజల కుటుంబ సభ్యునిగా నిరంతరం అభివృద్ధి కి పాటు పడుతున్న అని, అందుకు సిద్దిపేట ప్రజలు అందిస్తున్న ప్రేమ ఆదరణను నా తుది శ్వాస వరకు మీ సేవలో ఉంటానన్నారు.. గత స్పూర్తితో అందరం కల్సి పని చేసి, బూత్ స్థాయి నుండే ప్రతి ఒక్కరినీ కలవాలి .. ప్రతి ఇల్లు తిరగాలని సూచించారు.. ప్రతి ఇంట్లో సంక్షేమం ఉంది..ప్రతి ఊళ్ళో ప్రగతి ఉన్నదని ప్రజల్లో ఉండాలి మన అభివృద్ధి సంక్షేమాన్ని తెలియజేయాలని పిలుపునిచ్చారు..
ఔర్ ఏక్ దక్కా…దేడ్ లాక్ పక్కా..
‘‘గత ఎన్నికల్లో మా లక్ష్యం లక్ష మెజారిటీ…అదే స్ఫూర్తితో ఈ ఎన్నికల్లో ‘‘ఔర్ ఏక్ దక్కా…దేడ్ లాక్ పక్కా’’( ఎక్ లాక్ పచ్చాస్ అజార్ పక్కా) అనే నినాదంతో పని చేస్తామని నాయకులు రాధాకృష్ణ శర్మ, రాజనర్స్, రవీందర్ రెడ్డి, చిన్నా, పాల సాయి రాం, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, సంపత్ రెడ్డి , శ్రీకాంత్ రెడ్డి, సోమిరెడ్డి, లింగం గౌడ్, ఎల్లారెడ్డి, ఎద్దు యాదగిరి, ఎర్ర యాదయ్య, శ్రీహరి గౌడ్, ఉమా, జంగటి కనకరాజు, రాములు యాదవ్ తదితరులు మాట్లాడారు. సమన్వయంతో అందరం కల్సి ఐక్యతతో ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని ఇస్తామని చెప్పారు. మీరు 5ఏళ్ళు మా గురించి కష్ట పడ్డారు మేము ఒక హనుమాన్ దీక్ష, అయ్యప్ప దీక్ష లా..హరీశ్ దీక్ష నేటి నుండి 50 రోజులు దీక్ష లో ఉండి మీకు విజయ తిలకం దిద్దుతామని చెప్పారు.





