ఓరుగల్లు నగరంలో అవినీతి అక్రమాలు, భూకబ్జాలను నిలదీయాలి

  • పాదయాత్రలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
  • ప్రజల నుంచి స్థానిక సమస్యలు తెనుసుకుంటూ ముందుకు

సుబేదారి(హన్మకొండ), ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : తెలంగాణ ప్రజల ఉద్యమ గడ్డ, కాకతీయుల పురిటి గడ్డ, రాణి రుద్రమదేవి ఏలిన రాజ్యం ఈ ఓరుగల్లు అనేక ఉద్యమాలకు పురిటిగడ్డగా గుర్తింపబడింది. ఇంత ఘన చరిత్ర కలిగిన ఓరుగల్లు ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను, భూ కబ్జాలను నిలదీయడానికి ముందుకు రావాలని, కాంగ్రెస్‌ ‌పార్టీ తెలంగాణ పిసిసి అధ్యక్షుడు అనుముల రేవంత్‌ ‌రెడ్డి ‘‘హాత్‌ ‌సే హాత్‌ ‌జోడోయాత్రలో భాగంగా సోమవారం సాయంత్రం హనుమకొండ సుబేదారిలోని ఆర్టస్ అం‌డ్‌ ‌సైన్స్ ‌కళాశాల నుండి హనుమకొండ చౌరస్తా ఏనుగుల గడ్డ వరకు కొనసాగింది. అదాలత్‌ ‌సెంటర్‌ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అక్కడి నుండి రేవంత్‌ ‌రెడ్డి పాదయాత్రలో భాగంగా నగరంలోని ప్రజల సమస్యలను తెలుసుకొని, ముఖ్యంగా యువతీ యువకుల, విద్యార్థుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

గతంలో కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్‌ ఏటా వచ్చేదని, ప్రస్తుతం టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ పాలనలో విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్‌ ‌రావడం లేదని, హాస్టల్లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, విద్యార్థులకు మౌలిక వసతులు కల్పనలో ప్రభుత్వం విఫలమైందని విద్యార్థులు రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. పాదయాత్ర సాగిన విధానం ఆర్టస్ అం‌డ్‌ ‌సైన్స్ ‌కళాశాల నుండి అమరవీరుల స్థూపం వరకు అక్కడి నుండి కాలేజీ విగ్రహం కసిల పార్కు హన్మకొండ కొత్త బస్టాండ్‌ ‌శ్రీదేవి మాల్‌ అం‌బేద్కర్‌ ‌సర్కిల్‌ ‌పోలీస్‌ ‌హెడ్‌ ‌క్వార్టర్స్ ‌హన్మకొండ చౌరస్తా మీదుగా ఏనుగుల గడ్డకు పాదయాత్ర కొనసాగింది. సాయంత్రం ఏనుగుల గడ్డ సెంటర్లో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ…గత తొమ్మిది సంవత్సరాలుగా రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అరాచకాలకు పాల్పడుతుందని నాయకులు ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు భూ దందాలకు పాల్పడుతున్నారని, అవినీతి అక్రమాలలో ఆరితేరారని, రాష్ట్రంలో రైతులు ఎదుర్కుంటున్న సమస్యలు, ముఖ్యంగా నగరంలోని సమస్యలు పరిష్కరించుటలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు విఫలమయ్యారన్నారు.

ప్రజలు అనేక కష్టనష్టాలకు గురవుతున్నారని, ప్రజా సమస్యలు పట్టించుకోవడంలో ప్రభుత్వం నిమ్మకు నీరేత్లినట్టు వ్యవహరిస్తుందని, విద్య వైద్యాన్ని నిర్లక్ష్యం చేయడం ఈ ప్రభుత్వానికి చెల్లిందని ఆయన అన్నారు. పేదలకు బడుగు బలహీన వర్గాలకు చెందాల్సిన రెండు పడకల ఇళ్లను ఇప్పటి వరకు కేటాయించలేదని, కేవలం రాజకీయ నాయకుల అడుగులకు మడుగులోత్తే నాయకులకే డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లను కేటాయిస్తున్నారని రేపత్‌ ‌రెడ్డి ఆరోపించారు. ఇంతకుముందు కాజీపేట దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు, అంతకు ముందు రేవంత్‌ ‌రెడ్డి వరంగల్‌ ‌ప్రెస్‌ ‌క్లబ్‌ ‌సందర్శించారు.

ఈ సందర్భంగా ప్రెస్‌ ‌క్లబ్‌ అధ్యక్ష కార్యదర్శులు జర్నలిస్టులు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించుటకు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో దృష్టికి తీసుకుపోయి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని రేవంత్‌ ‌రెడ్డికి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం జర్నలిస్టులు అనేక సమస్యలను ఎదుర్కుంటున్నారని, విధి నిర్వహణలో తమ ప్రాణాలను లెక్కచేయకుండా నిత్యం ప్రజా సమస్యలను వెలికి తీసి తెలియజేయడంలో జర్నలిస్టులు ముందుంటారని. జర్నలిస్టులకు చెందాల్సిన డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లను, ప్రభుత్వం ఇప్పటి వరకు కేటాయించలేదని, జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని. తమ ప్రభుత్వం రాగానే జర్నలిస్టులకు డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్ల నిర్మాణం చేపడతామని, వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. రేవంత్‌ ‌రెడ్డి వెంట జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు నాయిని రాజేందర్‌ ‌రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *