ఓపెన్ స్కూల్ ప్రవేశాల పోస్టర్ ఆవిష్కరణ

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 2: వికారాబాద్ జిల్లాలో ఓపెన్ స్కూల్ అడ్మిషన్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ 2023-24 విద్యా సంవత్సరానికి గాను  జిల్లా విద్యాధికారి రేణుకా దేవిచే ఓపెన్ స్కూల్ పోస్టర్ , మరియు కరపత్రములు విడుదల చేయడం చేశారు.  ఈ  కార్యక్రమంలో నవాబుపేట్ మరియు వికారాబాద్ మండల విద్యాధికారులు గోపాల్,బాబుసింగ్ లు, జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ కె.వి.సత్యనారాయణ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి రేణుక దేవి మాట్లాడుతూ ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్లకు అవగాహన కల్పించి, ఈ ప్రవేశాల గురించి అధిక ప్రచారం కల్పించి ప్రవేశాల సంఖ్య పెంచాలని సూచించారు, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా 2023-24 విద్యా సంవత్సరానికి గాను పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ కోర్సుల్లో చేరేందుకు ఆగస్టు 31 వరకు గడువు ఉందని ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.  మరిన్ని వివరాలకు జిల్లా కోఆర్డినేటర్ సత్యనారాయణ (8008773523) ను సంప్రదించాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *