సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 16: జిల్లాలో ఓటు హక్కు గల ప్రతి ఒక్కరు కచ్చితంగా తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకునేలా ఓటర్లను చైతన్య పరచాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు.గురువారం కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా స్వీప్,తదితర నోడల్ అధికారులు, సెక్టోరల్ అధికారులు తదితరులతో స్వీప్,ఓటరు చైతన్యం పై చేపట్టిన,చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు అవేర్ నెస్ ఫోరమ్స్ ద్వారా ప్రతి ఒక్క ఓటరు ఓటు వేసేలా అవగాహన కల్పించి చైతన్య పరచాలని సూచించారు.
నవంబర్ 30 న విధిగా భాద్యతగా ఓటు వేయాలని సూచించాలన్నారు.రెసిడెన్సి వెల్ఫేర్ అసోసియేషన్స్, కాలనీలు, మున్సిపాలిటీలలో,
చిన్న,మీడియం,పెద్ద పరిశ్రమలలో,అన్ని సంస్థలలో ఓటరు అవేర్ నెస్ ఫోరమ్స్ ఏర్పాటు చేయాలన్నారు. అక్కడ ఓటరు అవేర్నెస్ ఫోరం నిర్వహణకు మేనేజ్మెంట్ లో ఒకరిని నోడల్ అధికారిగా పెట్టాలన్నారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని,రిజిస్టర్ నిర్వహించాలన్నారు. సెక్టోరల్ అధికారి సహకారంతో సి ఎస్ ఆర్ క్లస్టర్ అధికారులు ప్రతి పరిశ్రమలో ఉన్న సిబ్బంది అందరితో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. మండలం, క్లస్టర్, సెక్టార్ వారిగా వివరాలు తీసుకోవాలన్నారు.మున్సిపాలిటీ స్థాయిలో మున్సిపాలిటీ వర్కర్లతో, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ లు, కాలనీలలో సమావేశాలు నిర్వహించి, ఓటు హక్కు వినియోగించు కునేలా అందరికీ అవగాహన కల్పించాలన్నారు.ఆయా అవగాహన సమావేశంలో ఓటరు స్లిప్పులు అందాయా,మీ పోలింగ్ కేంద్రం తెలుసా, ఓ టు వేయడానికి ఈ సి ఐ సూచించిన గుర్తింపు కార్డుల వివరాలు, ఓ టు ప్రాధాన్యత,పోలింగ్ తేదీ తదితర విషయాలను తెలియ జెయాలన్నారు. ప్రతీ ఓటరుకు ఓటరు సమాచార స్లిప్ అందాలని,ఓటరు సమాచార స్లిప్ అందలేదన్న ఫిర్యాదు రాకూడ దన్నారు.ఓటర్ అవేర్ నెస్ ఫోరమ్స్ ద్వారా అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్,మాధురి,స్వీప్ నోడల్ అధికారి అఖిలేష్ రెడ్డి, సెక్టోరల్ అధికారులు, సి ఎస్ ఆర్ క్లస్టర్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



