- కేజ్రీవాల్, మాన్, కెసిఆర్‌లకు లిక్కర్ స్కామ్‌లో వాటాలు
- ఆరోపణల నుంచి తప్పించుకునేందుకే బిఆర్‌ఎస్
- బిజెపి రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్
న్యూ దిల్లీ, డిసెంబర్ 21 : తెలంగాణలో మొదలైన కల్వకుంట్ల కుటుంబం దోపిడీ, ఇప్పుడు దేశ రాజధానికి చేరిందని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ విమర్శించారు. రాబోయే రోజులలో మరిన్ని నిజాలు వెల్లడవుతాయని, వీరందరికీ కఠిన శిక్షలు పడాల్సిందేనని అభిప్రాయపడ్డారు. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి దిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశాలు జరిపారని ఈడీ చెప్పిందని తరుణ్ చుగ్ అన్నారు. ఈ వి•టింగుల వెనక ఉన్న మతలబు ఏమిటని ఆయన ప్రశ్నించారు. సవి•ర్ మహీంద్రుతో ఆమెకు ఉన్న సంబంధాలేంటో కూడా తెలియాలని డిమాండ్ చేశారు.
మద్యం కుంభకోణం ఛార్జ్ షీట్‌లో మరోసారి కవిత పేరు బయట పడిందని గుర్తు చేశారు. అలాగే కేసీఆర్ మౌనం ఎన్నో అనుమానాలకు తావిస్తుందన్నారు. సవి•ర్ మహీంద్రుతో కలిసి లిక్కర్ స్కామ్ ద్వారా కవిత దోపిడీ చేశారని అన్నారు. దిల్లీ లిక్కర్స్ స్కామ్‌పై దర్యాప్తు తరహాలో తెలంగాణ, పంజాబ్ లిక్కర్ పాలసీ పైనా దర్యాప్తు జరగాలని తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు. చార్జి షీట్‌లో కవిత పేరు 48 సార్లు ఈడీ ఎందుకు ప్రస్తావించిందో కేసీఆర్ జవాబు చెప్పాలని ఈ సందర్భంగా నిలదీశారు. కవిత ఎందుకు అన్ని ఫోన్లు మార్చారో ప్రజలకు చెప్పాలని కోరారు. మాఫియా తరహాలో ఫోన్లను ధ్వంసం చేశారని, అసలు సవిర్ మహేంద్రుతో కవితకు ఉన్న సంబంధం ఏమిటి అని ప్రశ్నించారు. ఈ కేసు బోగస్ అయితే కుంభకోణంలో ఉన్న వారంతా కవిత ఇంటికి ఎందుకు వొచ్చారంటూ మండిపడ్డారు. అవినీతి ఆరోపణల నుంచి బయట పడేందుకే పార్టీ పేరును బీఆర్‌ఎస్‌గా కేసీఆర్ మార్చుకున్నారని ఆరోపించారు.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్, తెలంగాణ సీఎం కేసీఆర్, దిల్లీ సీఎం కేజీవ్రాల్ అందరూ లిక్కర్ స్కామ్‌లో ఉన్నారని ఆరోపణలు చేశారు. కుటుంబవాదంతో తెలంగాణను దోపిడీ చేసిన కేసీఆర్ ఈ ప్రణాళికలో భాగంగానే అరవింద్ కేజీవ్రాల్, భగవంత్‌మాన్‌లను కలిశారన్నారు. పంజాబ్ రైతులకు చెక్కులు ఇవ్వడం ఒక సాకు మాత్రమేనన్న తరుణ్ చుగ్…దాని వెనుక కూడా లిక్కర్ కుంభకోణం ఉందని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ ముఖ్య పథకాలు కుటుంబ రాజకీయాలు, అహంకారం, అవినీతి పరిపాలన దోచుకున్న డబ్బు బయటపడకుండా ఉండేందుకే టీఆర్‌ఎస్ పార్టీ పేరు బీఆర్‌ఎస్‌గా మార్చారని విమర్శించారు.




