ఐఫోన్‌ 12‌కు రేడియేషన్‌ ఎఫెక్ట్…. ‌ఫ్రాన్స్‌లో విక్రయాలు బంద్‌

పారిస్‌, ‌సెప్టెంబర్‌ 14 ః ‌యాపిల్‌ ‌కంపెనీకి చెందిన ఐఫోన్‌ 12 ‌పరిమితికి మించి రేడియేషన్‌ను విడుదల చేస్తోందని, ఆ ఫోన్ల అమ్మకాలను ఫ్రాన్స్‌లో నిలిపివేయాలని ఆ దేశానికి చెందిన నేషనల్‌ ‌ఫ్రీక్వెన్సీ ఏజెన్సీ (ఏఎన్‌ఎఫ్‌ఆర్‌) ‌యాపిల్‌ ‌కంపెనీని ఆదేశించింది. ఇటీవల 141 ఫోన్లను పరీక్షించగా.. వాటిలో ఐఫోన్‌ 12 ‌రకం స్మార్ట్‌ఫోన్లలో ఎక్కువగా స్పెసిఫిక్‌ అబ్జార్‌ప్సన్‌ ‌రేట్‌ (ఏఎస్‌ఆర్‌) ఉం‌దని గుర్తించినట్టు రేడియేషన్‌ ‌ప్రీక్వెన్సీని పర్యవేక్షించే ఈ సంస్థ వెల్లడించింది.

ఆ ఫోన్లలో ఎలక్టోమ్రాగ్నెటిక్‌ ఎనర్జీ అబ్జార్‌ప్సన్‌ ‌కిలోగ్రాముకు 5.74 వాట్‌ ఉం‌దని తెలిపింది. యూరోపియన్‌ ‌యూనియన్‌ ‌స్టాండర్డ్ ‌కిలోగ్రాముకు 4 వాట్‌ ‌కంటే ఇది చాలా అధికమని ఏఎన్‌ఎఫ్‌ఆర్‌ ‌పేర్కొంది. ఇప్పటికే అమ్ముడుపోయిన ఫోన్లలో ఈ లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని యాపిల్‌ ‌కంపెనీని ఆదేశించింది. లేదంటే వాటిని కూడా రీకాల్‌ ‌చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీనిపై రెండు వారాల్లోగా స్పందించాలని తెలిపింది. కాగా, ఈ ఆరోపణలను యాపిల్‌ ‌కంపెనీ ఖండించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *