ఏదో ఒక రాయిలే అని వోటేయకండి… ఆలోచించి వేయండి

పెట్టుకున్న టోపీ కాదు

పెట్టిన టోపీ చూడు

ఎగరేసిన జెండా కాదు

చాటున ఆర్జించిన చందా చూడు)

-కాళోజీ కవిత

పపట్టణ ప్రాంతాలలోని బస్తీలను రెసిడెన్షియల్‌ జోన్లుగా మాస్టర్‌ ప్లాన్‌ లో గుర్తించండి.

లిపట్టణ పేదల ఇళ్ళ స్థలాల క్రమబద్దీకరణకు ఉద్దేశించిన G.ూ58,59ల అమలును నిరంతరం కొనసాగించండి. భూమి పట్టాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించండి.

పసుప్రీంకోర్టు సూచనల మేరకు షెల్టర్‌ హెరీమ్స్‌ నిర్మాణాలు చేపట్టండి.

పచెరువుల కబ్జాలు నివారించి, నీటి వనరులను కాలుష్యం చేసే వారిపై చర్యలు తీసుకోండి.

ప స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ చట్ట పరిధిని తెలంగాణకు కూడా విస్తరింపచేసి, పట్టణ ప్రాంతాలలో వరదల నివారణపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.

ప రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాపాడడానికి కృషి చేస్తామని స్పష్టమైన ప్రకటన చేయండి.

పఅధికారికంగా నిర్వహించే కార్యక్రమాలలో మత ప్రమేయం లేకుండా చేస్తామని, సెక్యులర్‌ స్ఫూర్తిని కొనసాగిస్తామని నిర్ద్వందంగా ప్రకటించండి.

పప్రజలు ప్రజాస్వామిక పద్ధతిలో తమ భావాలను, ప్రభుత్వ విధానాల పట్ల తమ వైఖరిని చెప్పటానికి అవకాశం ఉండి తీరాలి. ముందస్తు అరెస్టులు, అక్రమ కేసులు, విచ్చలవిడి హింసా ప్రయోగం మానుకోవాలి.

పఏ పార్టీ ఎటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరించినా నిరసించే హక్కు అధికారానికి బయట ఉన్న ప్రజలకు ఉందని గుర్తుంచుకోవాలి. హక్కే లేకపోతే దేశానికి స్వాతంత్య్రం, మనకు ప్రత్యేక రాష్ట్రం వచ్చేవే కావని మర్చిపోవద్దు.

పఅన్నిటి కంటే ముఖ్యంగా వివిధ పథకాల పేరు మీద మీరు ఇటీవల ప్రజలకు ఇస్తున్న డబ్బు మీ జేబులోంచి తీసి ఇస్తున్నది కాదని, అది వారి సంపదలో భాగమేనని గుర్తు పెట్టుకోండి. ప్రజలను మీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడ్డవారిగా, లబ్దిదారులుగా చూడకండి. మీరు వాళ్ళకు ఇచ్చే దాని కంటే ఎన్ని రెట్లు ఎక్కువ పొందుతున్నారో లెక్కవేస్తే మీరే ప్రజలకు ఋణపడతారు. నగదు బదిలీ పథకాల కంటే కష్టం చేసి బ్రతికే అవకాశాల్ని సృష్టించడం వారికి గౌరవం, సమాజానికి పురోగతి అని గుర్తించండి.

రాజకీయాలంటే ప్రజల ఉమ్మడి సమస్యలకు సరళమైన, సామరస్యపూర్వకమైన పరిష్కారాలను చూపే శాస్త్రం అని సామాజిక శాస్త్రవేత్తలంటారు. కాని స్వాతంత్య్రం సాధించిన నాటి నుండీ మన ప్రజాస్వామ్యపు నడక, మన రాజకీయాల సరళి, పైన చెప్పిన నిర్వచనానికి పూర్తి వ్యతిరేకంగా సాగుతూ ఉన్నది. పరిపాలనలో గాని, విధి విధానాల రూపకల్పనలో గాని పౌర సమాజపు ప్రభావం క్రమంగా కుంచించుకుపోతోంది. ఐదు సంవత్సరాలకు ఒకసారి వోటు వేసి, అదే ప్రజాస్వామ్యం అని భ్రమసి, దాని పర్యవసానాలన్నింటికీ మౌన ప్రేక్షకులుగా మారుతున్న విషాదకర పరిస్థితిలో మనం ఉన్నాం. చిన్నమొత్తపు డబ్బుతో తీరే తక్షణ అవసరాలు పేద, మధ్యతరగతి ప్రజలుగా మనకు ఎన్ని ఉన్నా, వాటికోసం సుదీర్ఘ భవిష్యత్తును బలి పెట్టవద్దని, అది మనకే కాదు రాబోయే తరాల వారికి కూడా నష్టదాయకమని, అంతిమంగా ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని ప్రజలంతా గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వోట్ల కోసం వచ్చే పార్టీలను, అభ్యర్థులను పై అంశాల పట్ల వాళ్ల వైఖరేమిటని ప్రశ్నిద్దాం. ఇటువంటి కీలక ఎన్నికల సమయంలో ఏదో ఒక రాయిలే అని మనం ఏ మాత్రం విశ్వసించని అభ్యర్థికి గానీ, పార్టీకి గానీ వోటేయవద్దని ప్రజలను కోరుతున్నాం. భద్రతతో కూడిన సుస్థిర భవిష్యత్తు కోసం వోటు అనే హక్కును వాడుకుందాం.

-డా.ఎస్‌.తిరుపతయ్య

(మానవ హక్కుల వేదిక (హెచ్‌ ఆర్‌ ఎఫ్‌) తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర కార్యదరి , 9849228212)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *