ఏకతాటిగా…ఏకగ్రీవాలు..

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: సిద్దిపేట నియోజకవర్గం లో చిన్నకోడూర్ మండలం లో గత ఎన్నికల్లో అన్ని మండలాల కంటే ఎక్కువ మెజారిటీ తెచ్చాము అని అదే పంథాలో ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీ మంత్రి హరీష్ రావు కి ఇస్తామని జడ్పి చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ,ఎంపీపీ మాణిక్య రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కాముని శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా చిన్నకొడూర్ మండలం కమ్మర్ల పల్లి గ్రామ యాదవ సంఘం,సికిందల పూర్  గ్రామ రెడ్డి సంఘం మంత్రి హరీష్ రావు గారికె మా మద్దతు ప్రకటిస్తూన్నామని ఏకగ్రీవ తీర్మానం మంత్రి హరీష్ రావుకి అందజేశారు. అదేవిధంగా చిన్నకోడూర్ మండలం బైండ్ల సంఘం, మండల ఈవెంట్స్ అసోసియేషన్ మంత్రి హరీష్ రావు  మా నాయకుడు, సిద్దిపేట ను దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నారని ఎల్లప్పుడూ మేము బిఆర్ఎస్ పార్టీ మంత్రి హరీష్ రావు వైపే ఉంటాము అని ముక్తకంఠంతో నినదించారు.జడ్పి చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ కు, ఎంపీపీ మాణిక్య రెడ్డి, కాముని శ్రీనివాస్,సర్పంచ్ ఉమేష్ కు ఎంపీటీసి శ్రీనివాస్ లకు ఏకగ్రీవ తీర్మానాలను అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *