ఎలక్ట్రిక్‌ ‌వాహనాలకు పెరుగుతున్న ఆదరణ

  • ఇంధన ఆదాతో పాటు…పర్యావరణహితం
  • ప్రజల డిమాండ్‌తో పలు కంపెనీల ఉత్పత్తి

న్యూ దిల్లీ,ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌సెప్టెంబర్‌25: ‌సంప్రదాయ ఇంధనం బదులు విద్యుత్‌ ‌ఛార్జీతో నడిచే వాహనాలకు ప్రోత్సాహం పెరుగుతోంది. ఎలక్ట్రిక్‌ ‌వాహనాల ఉత్పత్తి కూడా పెరుగుతోంది. దీంతో ఇంధనం ఆదాతో పాటు, కాలుష్యం కూడా అరికట్టవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్‌ ‌వాహనాలకు డిమాండ్‌తో పాటు కేంద్రం నుంచి ప్రోత్సాహం అందుతోంది. దీంతో భారతీయ ఆటోమోటివ్‌ ‌పరిశ్రమకు చెందిన మూడు ఆటోమోటివ్‌ ‌దిగ్గజాలు – మారుతి సుజుకి, హ్యుందాయ్‌, ‌టాటా మోటార్స్… ‌త్వరలో కొన్ని సబ్‌ ‌కాంపాక్ట్ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీలను విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నాయి. కంపెనీ ఎలక్ట్రిక్‌ ‌వెహికల్‌ ‌పోర్ట్‌ఫోలియోలో ముఖ్యమైన దశను సూచిస్తూ టాటా మోటార్స్ ఈ ఏడాది చివర్లో పంచ్‌ ఈవీని విడుదల చేయడానికి ఇప్పటికే సిద్ధంగా ఉంది. మరోవైపు హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌ ఈవీని కూడా పరీక్షిస్తోంది. ఇది దాని ఈవీ లైనప్‌లో చవకైన ఎలక్ట్రిక్‌ ‌కారు కావచ్చు. మారుతి సుజుకి ఈ సంవత్సరం ప్రారంభంలో రాబోయే ఎలక్ట్రిక్‌ ‌కార్ల టీజర్‌ను విడుదల చేసింది. వీటిలో ఎలక్ట్రిక్‌ ‌వెర్షన్‌ ‌మారుతి సుజుకి ఫ్రాంక్స్ ‌మైక్రో ఎస్‌యూవీ అందరి దృష్టిని ఆకర్షించింది.

టాటా పంచ్‌ ఈవీ 2023 పండుగ సీజన్‌లో విడుదలయ్యే అవ కాశం ఉంది. ఇది టాటా జిప్‌ ‌ట్రాన్‌ ఎలక్ట్రి ‌పవ• •ట్రెయిన్‌తో మార్కె ట్లోకి రానుంది. ఇందులో లిక్విడ్‌ ‌కూల్డ్ ‌బ్యా టరీ, పర్మినెంట్‌ ‌మాగ్నెట్‌ ‌సింక్రోనస్‌ ‌మోటార్‌ ఉం ‌టుంది. టియాగో ఈవీ పవ• •ట్రెయి న్‌ను పంచ్‌ ఈవీలో చూడవ చ్చు. ఇందులో రెండు బ్యాటరీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 74 బీహెచ్‌పీ ఎలక్ట్రిక్‌ ‌మోటార్‌తో 19.2 కేడబ్ల్యూహెచ్‌ ‌యూనిట్‌, 61 ‌బీహెచ్‌పీ ఎలక్ట్రి ‌మోటార్‌తో 24 కేడబ్ల్యూహెచ్‌ ‌యూనిట్‌ ఇం‌దులో చూడవచ్చు. దాని ఐసీఈ మోడల్‌ ‌మాదిరిగానే ఎలక్ట్రి ‌పంచ్‌ ‌కొత్త 10.25 అంగుళాల టచ్‌‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ ‌సిస్టమ్‌, ‌కొన్ని ఇతర ఫీచర్లను పొందవచ్చని భావిస్తు న్నారు. హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌ ఈవీ కూడా టెస్టింగ్‌ ‌ప్రారంభ దశలో ఉంది. ఇది 2024లో లాంచ్‌ అవుతుందని భావిస్తున్నారు. ఇది నేరుగా ఎలక్ట్రి ‌వెహికల్‌ ‌సెగ్మెంట్‌లో టాటా పంచ్‌ ఈవీతో పోటీ పడనుంది.

ఎక్స్‌టర్‌ ఈవీ 25 కేడబ్ల్యూహెచ్‌ ‌నుంచి 30 కేడబ్ల్యూహెచ్‌ ‌బ్యాటరీ ప్యాక్‌ను పొందవచ్చని నివేదికలు సూచిస్తు న్నాయి. ఇది ఒక్కసారి ఛార్జ్ ‌చేస్తే దాదాపు 300 నుంచి 350 కిలోటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఎలక్ట్రి ‌మైక్రో ఎస్‌యూవీలో కొన్ని కాస్మెటిక్‌ ‌మార్పులను హ్యుందాయ్‌ అం‌దిస్తుం దని తెలుస్తోంది. అయితే ఇంటీరియర్‌ ‌లేఅవుట్‌, ‌స్పెసిఫికేషన్‌లు ఐసీఈ ఎక్స్‌టర్‌ని పోలి ఉంటాయి. మారుతి సుజుకి 2030 ఆర్థిక సంవత్సరం నాటికి ఆరు కొత్త బ్యాటరీ ఎలక్ట్రి ‌వాహనాల మోడళ్లను పరిచయం చేయబో తున్నట్లు ప్రకటించింది. మొదటి మారుతి సుజుకి ఎలక్ట్రి ‌కారు ఎస్‌యూవీ ఫ్రాంక్స్ ఈవీ 2025 ప్రారంభంలో విడుదల అవుతుందని భావిస్తు న్నారు. వాగర్‌ఆర్‌ ఈవీ, బలెనో ఈవీ వంటి మోడళ్లను టీజ్‌ ‌చేసింది. ఫ్రంట్‌ఎక్స్ ఈవీ, గ్రాండ్‌ ‌విటారా ఈవీ, జ్ని ఈవీ కనిపిం చాయి. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి భారీ మార్కెట్‌ ‌వాటాను సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంగా వివిధ కం పెనీలు ఇప్పుడు ఎలక్ట్రిక్‌ ‌కార్లను తయారు చేసేం దుకు సిద్దం అవుతున్నాయి. ఇటీవల మంత్రి గడ్కరీ కూడా ఇలాంటి వాహనాలను ప్రోత్సహిస్తామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *