ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 27 : ఎన్నికల విధుల్లో నియమించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారిని కలెక్టర్ భారతి హోలికేరి సూచించారు. ఈ మేరకు ఇప్పటికే శిక్షణ తరగతులు నిర్వహించిన ఆయా కేంద్రాలలో ఫెసిలిటేషన్ సెంటర్ లను ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు. రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లోనూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ కు అవకాశం కల్పించామని గుర్తు చేశారు. ఈ నెల 26వ తేదీ వరకు జిల్లాలో 10312 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారని వివరించారు. ఇంకనూ ఎవరైనా పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకోనట్లయితే, అలాంటి వారి కోసం ఈ నెల 29న పోలింగ్ సామాగ్రి పంపిణీ నిమిత్తం ఖరారు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు. ఈ అవకాశాన్ని ఎన్నికల విధుల్లో నియమించబడిన ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఎన్నికల విధుల్లో నియమించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ భారతి హోళీ కేరి





