ఎన్డీఏ కూట‌మి విజ‌యంపై న్యూజెర్సీలో సంబ‌రాలు..

ఇంట‌ర్నెట్ డెస్క్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 14 :భార‌త్ లో  బీజేపీ నేతృత్వంలోని ఎన్ డీఏ కూట‌మి అధికారంలోకి రావ‌డంపై అమెరికాలో న్యూజెర్సీ రాష్టంలో ఎడిసన్ నగరం రాయల్ ఆల్బర్ట్  ప్యాలెస్‌లో గురువారం విజ‌యోత్స‌వాలు నిర్వ‌హించారు. ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ అడపా ప్రసాద్ నేతృత్వంలో ఈ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం.. దాని మిత్రపక్షాలు వరుసగా మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్య‌క్తం చేశారు. ఈ వేడుకకు సుమారు 800 మందికి పైగా ప్రజలు హాజ‌రయ్యారు. జ్యోత్స్న శర్మ వ్యాఖ్యాతగా  వ్యవహరించ‌గా.. ఉత్సాహభరితమైన డోల్ తాషా ప్రదర్శనలు, ఎన్నారైల నృత్యాలతో ప్రారంభమైంది.

డాక్ట‌ర్‌ అడపా ప్రసాద్..  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, ఎన్డీఏ కూటమి భాగస్వాములకు అభినందనలు తెలిపారు. 1962 తర్వాత మొదటి సారిగా వరుసగా మూడవసారి మోదీ అధికారం చేప‌ట్ట‌డం చారిత్రాత్మ‌క‌మ‌ని అన్నారు. అఫ్ బీజేపీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వాసుదేవ్ పటేల్ కొత్త ప్రభుత్వం తన వేగవంతమైన అభివృద్ధిని కొనసాగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య ప్రపంచంలో, రెండవ ప్రపంచ యుద్ధానంతరం, వరుసగా మూడోసారి ఎన్నికైన ఏకైక నాయకుడు నరేంద్ర మోదీ అని కొనియాడారు. ప్రతిసారి స్థిరమైన వోట్ల శాతంతో అంతర్జాతీయ రికార్డును నెలకొల్పారని కృష్ణారెడ్డి చెప్పారు.  టీడీపీ, జనసేన, జేడీయూ, శివసేన తదితర బీజేపీతోపాటు దాని ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల విజయాన్ని ఆయన ప్రశంసించారు.

డాక్ట‌ర్‌ సుధీర్ పారిఖ్, ఆల్బర్ట్ జెస్సాని, పీయూష్ పటేల్ బిజెపి ప్రభుత్వ విజయాలపై ప్రసంగించారు,అఫ్ బీజేపీ తెలంగాణ కన్వీనర్ / అధ్యక్షుడు విలాస్ రెడ్డి జంబుల మాట్లాడుతూ..  తెలంగాణలో ఎంపీ సీట్ల  కోసం అమెరికా లో అన్ని తెలంగాణ ఆఫ్ బీజేపీ  కమిటీ చాఫ్టర్లు కలిసి కట్టుగా 12 ఎంపీ జూమ్ కాల్స్ , ఫోన్ కాల్ కాంపెయిన్ , సోషల్ మీడియాలో వీడియోలు , ఛాయ్ పే చర్చలు , గ్లోబల్ కాల్ థాన్, గ్లోబల్ ఛాయ్ పే చర్చలు, యజ్ఞాలు, హోమాలు వంటివి చేసిన‌ట్లు వివ‌రించారు. రాబోవు 2029 లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు.చరణ్ సింగ్ ఉత్తర ప్రదేశ్ కోసం, అమర్ గోస్వామి గుజరాత్ కోసం కార్ ర్యాలీ వంటివి చేశార‌ని తెలిపారు. ఆక్టర్ పటేల్ తన పాటలతో , డాన్సుల‌తో ఆక‌ట్టుకున్నారు.

ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్ట‌ర్‌ సుధీర్ పరేఖ్, జయేష్ పటేల్, పీయూష్ పటేల్, కమ్యూనిటీ నాయకులు వాలంటీర్లు సహా న్యూజెర్సీ భారతీయ ప్రవాసులు పాల్గొన్నారు. కల్పనా శుక్లా, మా రాజ్యలక్ష్మి, దీప్తి జానీ, సంతోష్ రెడ్డి, గణేష్ రామకృష్ణన్, మధుకర్ రెడ్డి, శివదాసన్ నాయర్, జయశ్రీ, గోవిందరాజ్, ఓంప్రకాష్ నక్క,  జగదీష్ యలిమంచిలి, ప్రవీణ్ తడకమళ్ల , రఘు రెడ్డి, రామ్ వేముల,  శరత్ వేముల, విజయ్ కుందూరు, శ్రీనివాస్ గనగోని, శ్రీకాంత్ రెడ్డి, పృథ్వీ, రవి పెద్ది, నాగ మహేందర్, మధు అన్న, భాస్కర్, దాము గాదెల, ప్రవీణ్ గూడూరు, సుధాకర్ ఉప్పల, మృధుల, లక్ష్మీ మోపర్తి, గురు ఆలంపల్లి, గోపి, కమ్యూనిటీ లీడర్లు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *