- రాష్ట్రపతి ముర్ము చేతుల దుగా ఆవిష్కరణ
- హాజరైన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు
న్యూ దిల్లీ, ఆగస్ట్ 28 : ఉమ్మడి ఆంధ్రపద్రేశ సిఎం, దివంగత ఎన్టీఆర్ స్మారక నాణాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ చీఫ్, ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి, దగ్గుపాటి వెంకటేశ్వర్లు, నటుడు బాలకృష్ణ, నారా బ్రాహ్మణి, ఎన్టీఆర్ కుటుంబ అలాగే టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, ఎంపీ రఘురామ కృష్ణరాజు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, మాజీ ఎంపీ సుజనా చౌదరి, కంభంపాటి రామ్మోహన్ రావు, నిర్మాత అశ్విని దత్, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తదితరులు ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి హాజరయ్యారు.
ఎన్టీఆర్ పేరిట రూ.100 నాణెం విడుదల చేయాలన్న కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించడం గొప్ప విషయం. పురంధేశ్వరి ఈ పక్రియలో ముందు నుంచి అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నాణాన్ని ముద్రించింది. 44 మిల్లీ టర్ల చుట్టు కొలతతో ఉండే ఈ వంద రూపాయిల నాణాన్ని 50శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో తయారు చేశారు. ఈ నాణానికి ఓ వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, ఆ చిత్రం కింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో ముద్రించారు. ఆయన శతజయంతి ఈ ఏడాదితో ముగిసింది. కనుక 1923- 2023 అని ముద్రితమై ఉంటుంది.


