ఎనిమిదేళ్లుగా కెసిర్‌ ‌మోసం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : ‌సీఎం కేసీఆర్‌పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌ ‌వేదికగా విమర్శలు గుప్పించారు. అరచేతిలో వైకుంఠం చూపించడంలో కేసీఆర్‌ ఆరితేరిపోయారని ధ్వజమెత్తారు. ఎనిమిదేళ్లుగా ఇదే జరుగుతుందన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ ‌చేస్తూ ముఖ్యమంత్రిపై మండిపడ్డారు.

ఒక వాసాల మర్రేమిటి…! మొత్తం తెలంగాణ.. కేసీఆర్‌ ‌మాయ మాటలతో మోసపోయింది. ఎనిమిదేళ్లుగా కేసీఆర్‌ ‌మాటలు వినీ వినీ ప్రజలు విసిగిపోయారు. కల్వకుంట్ల కుటుంబానికి కర్రుకాల్చి వాతపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారంటూ రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. ఇవన్నీ ప్రజలు చూస్తూ ఊరుకోరని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *