నష్టాలే కారణమంటున్న సొసైటీ
హైదరాబాద్,డిసెంబర్5:అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నుమాయిష్ జనవరిలో మొదలు కానున్నది. ఈ ఎగ్జిబిషన్ ప్రవేశ రుసుమును రూ. 40కి పెంచనున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ టిక్కెట్‌పై రూ. 10 పెంచాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. కొవిడ్-19 మహమ్మారి కాలంలో నష్టాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. కొవిడ్19 కారణంగా 2021లోఎగ్జిబిషన్ నిర్వహించనేలేదు.
2022లో ప్రారంభించినప్పటికీ కొవిడ్19 నియంత్రణల కారణంగా తర్వాత దానిని సస్పెండ్ చేసేశారని తెలిపారు.ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, జమ్మూ అండ్ కశ్మీర్, గుజరాత్, ఆంధప్రదేశ్ తదితర ఇతర రాష్టాల్రకు దాదాపు 1200 స్టాల్స్ కేటాయించారు. బాగా చీకటి పడే వరకు జరిగే ఎగ్జిబిషన్ నిర్వహణకు టైమ్ రిలాక్సేషన్ విషయంలో పోలీసులు సహకరించాలని కూడా ఎగ్జిబిషన్ సొసైటీ కోరిందని తెలిపారు.
టెలికామ్ కంపెనీలు వైఫీ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, కొత్త తాత్కాలిక పొర్టేబుల్ టవర్లను కూడా ఏర్పాటుచేయాలని కోరారు.హైదరాబాద్‌లో ఎగ్జిబిషన్ అనేది చాలా కాలం నుంచి జరుగుతోంది. ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ వారి ఎకనామిక్ కమిటీ ఆలోచన మేరకు 1938లో ’నుమాయిష్ మొదలెట్టారు.




