ఎంపీపీ నుంచి అసెంబ్లీ స్పీకర్ దాకా ఎదిగిన ప్రసాద్ కుమార్

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 7: వికారాబాద్ శాసనసభ్యులు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ అసెంబ్లీ స్పీకర్గా ఎంపికయ్యారు ఈ మేరకు ఏఐసీసీ సెక్రెటరీ వేణుగోపాల్ సీఎం క్యాబినెట్ తో పాటు అసెంబ్లీ స్పీకర్గా ప్రసాద్ కుమార్ ను నియమిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. వికారాబాద్ శాసనసభ్యులు ప్రసాద్ కుమార్ 1964 జూన్ 4న తాండూరు మండలం బెల్కటుర్గ్రా మంలో జన్మించారు. 2001 నుండి 6 వరకు మర్పల్లి మండల ఎంపీపీగా పనిచేశారు. మాజీమంత్రి చంద్రశేఖర్ తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయడంతో 2008 బై ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రసాద్ కుమార్ వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తదనంతరం 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రసాద్ కుమార్ మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2013లో కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో చేనేత జౌలీ శాఖ మంత్రిగా ప్రసాద్ కుమార్ పనిచేశారు. అనంతరం 2014 18 సంవత్సరాలలో జరిగిన సాధారణ శాసనసభ ఎన్నికల్లో మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ ఓటమిపాలయ్యారు. మొన్న జరిగిన 2023 సాధారణ శాసనసభ ఎన్నికల్లో ప్రసాద్ కుమార్ భారీ మెజార్టీతో వికారాబాద్ శాసనసభ్యులు గెలుపొందారు. తాజాగా కిరణ్ కుమార్ మంత్రివర్గంలో ప్రసాద్ కుమార్ కు రాష్ట్ర శాసనసభ స్పీకర్ గా ఎంపికయ్యారు. మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ తెలంగాణ శాసనసభకు స్పీకర్గా ఎంపిక కావడంతో వికారాబాద్ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాడు ఎంపీపీగా మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం నేడు అసెంబ్లీ స్పీకర్ వరకు ఎదిగారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *