హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 3: : ప్రజల వైద్య అవసరాల కోసం పాత భవనాలు తొలగించి అయినా నిర్మాణాలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తూ .. అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిశీలించి, అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు తెలియ చేస్తుందని మంత్రి హరీశ్ రావు మంత్రి హరీష్ రావు తెలిపారు.ఉస్మానియా ప్రభుత్వ హాస్పిటల్ నూతన నిర్మాణానికి ప్రజాప్రతినిధులు ఏకగ్రీవ అభిప్రాయం వ్యక్తం చేసారు.ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణం అంశం పై హాస్పిటల్ పరిధి ప్రజా ప్రతినిధులతో మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో సచివాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు.
హైకోర్టు నుండి అనుమతి రాగానే వెంటనే నూతన భవన నిర్మాణం చేపడతామని మంత్రి వెల్లడించారు. ఉస్మానియా హాస్పిటల్ నూతన భవనం నిర్మించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపి అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, వాణీ దేవి, రహమత్ బెగ్, హసన్ ఎఫెండి, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్, దానం నాగేందర్, గోపీనాథ్, జాఫర్ హుస్సేన్, కౌసర్ మోయినుద్దీన్, హెల్త్ సెక్రెటరీ రిజ్వి, సీఎం ఓఎస్డీ గంగాధర్, ఇ ఎన్ సి గణపతి రెడ్డి, ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.




