సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 27: ఉమ్మడి రాష్ట్రంలో తొలిగించిన 250 హోమ్ గార్డులు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ని కలిసి వినతిపత్రం అందజేశారు.వెంటనే తమను విధులోకి తీసుకునే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని కోరిన హోమ్ గార్డులు అన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని ఆర్డర్ కాపీ లు లేవని మమ్మల్ని అన్యాయంగా తొలిగించారాని తెలిపారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళాము కానీ స్పందించలేదన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ…హోమ్ గార్డు ల సమస్యను సిఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తామని జగ్గారెడ్డి తెలిపారు.250 మంది హోమ్ గార్డు లను విధులోకి తీసుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి ని కోరుతనన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తొలిగించిన 250 హోమ్ గార్డులు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ని కలిసి వినతిపత్రం అందజేత




