ఉత్తమ సేవలు అందిస్తున్న సి.ఐ జలేందర్ రెడ్డి: పురుషోత్తం రెడ్డి

వనస్థలిపురం, ప్రజాతంత్ర, ఆగస్టు 12; వనస్థలిపురం ప్రజలకు ఉత్తమ సేవలందిస్తున్న సి.ఐ జలేందర్ రెడ్డి నికార్సైన అధికారి అ ని బి.ఎన్.రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి స్పష్టం చేశారు. శనివారం సి .ఐ జలంధర్ రెడ్డి ని సన్మానించారు. ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ శాంతిభద్రతలను కాపాడేందుకు కృషి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు విలేకరులకు చెప్పారు. ఎన్.జి. ఓ కాలనీ గ్రంథాలయం ప్రాంగణంలో కొందరు విద్యార్థులు మద్యం సేవిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానికులు సి.ఐ జలేందర్ రెడ్డి కి మొరపెట్టుకుంటున్నారు. ఎక్కడ చూసినా మద్యం సీసాలు, సోడా సీసాలు స్వయంగా సి .ఐ పవిత్రమైన గ్రంథాలయ ప్రాంగణాన్ని సందర్శించి పరిస్థితిని చక్కదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *