సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 9: సిద్దిపేట ఎన్నికల బరిలో బి ఆర్ ఎస్ పార్టీఅభ్యర్థి గా బరిలో నిలిచి 7 వ సారి పోటీ చేస్తున్న మంత్రి హరీష్ రావు ఎన్నికల ఖర్చుకు ఉడతా భక్తిగా సాయం చేయడానికి సిద్దిపేట సీనియర్ జర్నలిస్ట్ కలకుంట్ల రంగాచారి తనయుడు మాస్టర్ కలకుంట్ల నచికేత ముందుకు వచ్చాడు. గత కొంత కాలంగా తన తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీని కిడ్డీ బ్యాంకులో దాచుకొని పోగుచేసుకున్న డబ్బును గురువారం మంత్రి హరీష్ కు అందజేశాడు. తన తండ్రి సీనియర్ జర్నలిస్ట్ కలకుంట్ల రంగాచారితో కలిసి మంత్రి హరీష్ రావు ఇంటికి వెళ్లి కిడ్డీ బ్యాంక్ ను మంత్రి హరీష్ రావుకు అందజేశాడు. సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తూ.. సిద్దిపేట ప్రజలను తన స్వంత కుటుంబ సభ్యులు గా భావిస్తూ కష్ట సుఖాల్లో భాగస్వామి అయి ఆడుకుంటున్న మంత్రి హరీష్ రావుకు సిద్దిపేట నియోజకవర్గం లోని వివిధ వర్గాల ప్రజలు సంఘాలు సంపూర్ణ మద్దతు తెలుపుతూ అండగా నిలుస్తున్నారు.. సిద్దిపేట లో హరీష్ రావును లక్ష కు పైగా మెజారిటీ తో గెలిపించేందుకు స్వచ్చందంగా ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యం లోనే రాజకీయాలకే కొత్త నిర్వచనాన్ని ఇచ్చి ఎంతో మందికి స్ఫూర్తి గా నిలుస్తున్న మంత్రి హరీష్ రావుకు ఉడతా భక్తిగా సాయం అందించి మద్దతు ఇవ్వడం కోసం తాను దాచుకున్న కిడ్డీ బ్యాంకు లోని 3295 రూపాయలు ను అందించానని నచికేత తెలిపారు. మాస్టర్ నచికేత ను మంత్రి హరీష్ రావు ఈ సందర్బంగా అభినందించారు.
ఉడుతా భక్తి బుడుతని అభిమానం @3295 రూపాయలు





