ఈ నేల 11 వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం 

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 9: ఈనెల 11వ తేదీ సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు.శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగిసిన ఎన్నికల కోడ్ ఎత్తివేసినందున ఈనెల 11 రెండవ తేదీ సోమవారం నాడు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ సమస్యలపై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించడం జరుగుతుంది. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో జిల్లా ప్రజలకు  తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *