ఈనెల 7న కడ్తాలకు హోం మంత్రి మహమ్మద్ అలీ రాక 

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 6 :  నూతన మండలమైన కడ్తాలలో నూతనంగా ఏర్పాటుచేసిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ ఆలీ, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్  తీగల అనిత రెడ్డి, హాజరవుతున్నట్లు కడ్తాల మండల జడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు వార్డు సభ్యులు, పిఎసిఎస్ చైర్మన్, డైరెక్టర్లు, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు పార్టీ యువజన సంఘం అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మరియు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల రైతు కోఆర్డినేటర్ జోగు వీరయ్య, స్థానిక సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి, ఉపసర్పంచ్ రామకృష్ణ, ఎంపిటిసి లచ్చిరాం నాయక్, సాలార్పూర్ ఎంపిటిసి ప్రియా రమేష్, మాదారం సర్పంచ్ సులోచన సాయిలు, గ్రామ రైతు కోఆర్డినేటర్ మంగళ్ పల్లి నరసింహ, పిఎసిఎస్ డైరెక్టర్  సేవ్య, వార్డు సభ్యులు గురిగళ్ళ రామచంద్రయ్య, బిఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షులు కొప్పు కృష్ణ, కంబాలపల్లి అంజి, సిద్ది గారి రాజశేఖర్, కాలే శీను, కంబాలపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *