ఈటలకు భద్రతపై కెటిఆర్‌ ఆరా

  • సవిక్షించాని డిజిపికి సూచన
  • ఈటల నివాసానికి సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి…భద్రతపై సమీక్ష

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 28 : ఈటల తనకు ప్రాణహాని ఉందని అన్నారో లేదో.. మంత్రి కేటీఆర్‌ ఆయన భద్రతపై ఆరా తీశారు. రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌కు ఫోన్‌ ‌చేశారు. ఈటల భద్రతపై సీనియర్‌ ఐపీఎస్‌తో వెరిఫై చేయించాలని డీజీపీకి కేటీఆర్‌ ‌సూచించారు. కేంద్ర ప్రభుత్వం సెక్యురిటీ పెంపు వార్తల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరుఫునే సెక్యూరిటీ ఇవ్వాలని కేటీఆర్‌ ‌సూచించారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతుందన్న ఈటల మాటల నేపథ్యంలో భద్రత పెంపుపై డీజీపీ సవి•క్ష చేయనున్నారు. ఇదిలావుంటే తన భద్రతకు ముప్పు ఉందని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌చేసిన కామెంట్స్ ‌తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తనకు బెదిరింపులు వొస్తున్నాయని ఈటల అంటే..తన భర్తను చంపే కుట్ర జరుగుతుందని ఆయన భార్య జమున ఆరోపించారు.

దీని కోసం సుపారీ కూడా ఇస్తున్నారని ఆరోపణలు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ కేంద్రంగానే వాళ్లీ ఆరోపణలు చేశారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధిపై తీవ్ర ఆరోపణలు రావడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. వెంటనే ఈటల భద్రతపై రివ్యూ చేపట్టాలని అధికారులను ఆదేశించింది. వెంటనే కలుగుజేసుకున్న డీజీపీ…మేడ్చల్‌ ‌డీసీపీ సందీప్‌రావుకు స్పెషల్‌ ‌టాస్క్ ఇచ్చారు. డీజీపీ ఆదేశాల మేరకు స్పందించిన సందీప్‌రావు ఈటల రాజేందర్‌ను కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే అప్పటికే ఈటల బయటకు వెళ్లిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు.

దీంతో ఆయన వెళ్లిపోయి తర్వాత మరోసారి వెళ్లి ఆయనతో మాట్లాడారు. వివరాలు తీసుకొని డీజీపీకి రిపోర్ట్ ‌చేయనున్నారు డిసిపి. ఇక ప్రెస్‌ ‌వి•ట్‌ ‌పెట్టిన ఈటల కొన్ని నెలలుగా తనకు బెదిరింపులు వొస్తున్నాయని చెప్పారు. ఎలాంటి బెదిరింపులకు భయపడేవాడిని కానన్నారు. నయీమ్‌ ‌కే భయపడలేదని గుర్తు చేశారు. ఈ బెదిరింపులకు భయపడతానా అని ప్రశ్నించారు. తనతో పెట్టుకుంటే మాడిమసైపోతారని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *