ఈజిప్టు అధ్యక్షుడితో మోదీ భేటీ

న్యూదిల్లీ,జనవరి25 : భారత 74వ గణతంత్ర వేడుకలకు హాజరయ్యేందుకు ముఖ్య అతిధిగా వచ్చిన ఈజిప్టు అధ్యక్షుడు అద్బెల్‌ ‌ఫతా ఎల్‌-‌సిసితో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేలా వ్యవసాయం, డిజిటల్‌ ‌డొమైన్‌, ‌వాణిజ్యంతో సహా వివిధ రంగాలపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు.

ఆసియా, ఆఫ్రికా మధ్య వారధిగా ఉండే ఈజిప్టుతో తమ సంబంధాలు మరింత పెరుగుతున్నాయని,  ప్రాచీన, సాంస్క•తిక, ఆర్థికపరమైన సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ చర్చలు ఎంతో సహకరిస్తాయని కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్‌ ‌బాగ్చి వెల్లడించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఓ ఈజిప్టు అధ్యక్షుడు ఆహ్వానం పొందడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *