ఈక్వెస్ట్రియన్ క్రీడల్లో ఐజా మీర్ సంచలనం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 29 : ఈక్వెస్ట్రియన్ క్రీడల్లో అతి పిన్న వయస్కురాలైన ఐజా మీర్ సంచలనం సంచలనం సృష్టించింది. న్యూఢిల్లీలో జరిగిన ఎఫ్‌ఈఐ షో జంపింగ్ చిల్డ్రన్స్ క్లాసిక్‌లో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఐజా, తన నిష్ణాత భాగస్వామి డిల్లానో డబ్ల్యూను అధిగమించి, అసాధారణమైన నైపుణ్యం, దృఢ సంకల్పాన్ని ప్రదర్శించి, అంతర్జాతీయ వేదికపై తనదైన ముద్ర వేసింది. అక్టోబరు 2023లో ఖతార్‌లోని లాంగిన్స్ హతాబ్‌లో ఐజా భారత్‌కు కాంస్య పతకాన్ని సాధించింది. హైదరాబాదులోని నాసర్ పోలోలో కోచ్ యోగేష్ రాణా నిపుణులమార్గదర్శకత్వంలో, ,రైడర్, గుర్రం మధ్య అసాధారణ ప్రతిభ ప్రదర్శించింది. తాత నవాబ్ మీర్ ఖుతుబుద్దీన్ ఖాన్, తండ్రి మీర్ హఫీజుద్దీన్ అహ్మద్, మేనమామలు మీర్ మొహియుద్దీన్ మొహమ్మద్, మీర్ జమాలుద్దీన్ హమ్మద్, గ్లోబల్ సర్క్యూట్‌లో ప్రసిద్ధి చెందిన పోలో ప్లేయర్‌లతో ఆమె స్ఫూర్తి ఆమెపై ఉంది. ఆమె తల్లి అయేషా మీర్, అమ్మమ్మ బేగం సల్వా ఖాన్, అత్త జైనాబ్ మీర్ మద్దతుతో, ఐజా ఖైరతాబాద్‌లోని నాస్ర్ స్కూల్‌లో పాఠశాల విద్య, ఈక్వెస్ట్రియన్ ఎక్సలెన్స్‌పై ఆమెకున్న అభిరుచి తెలిపింది. ఐజా మీర్ యొక్క విజయం అంకితభావంతో కూడిన జట్టుకృషికి నిదర్శనం, అది ఆమెను విజయం వైపు నడిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *