ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 9 : కడ్తాల మండల కేంద్రానికి చెందిన క్యామ కవిత అంజయ్య దంపతులకు బిఆరెస్ పార్టీ అండగా నిలచింది. ఇటీవలే కవిత భర్త అంజయ్య మృతి చెందారు. వారి కుటుంబాన్ని పరామర్శించిన గోలి శ్రీనివాస్ రెడ్డి, సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి చేయూత అందిస్తున్నారు. కడారి రామకృష్ణ రూ. 20వేలు ఆర్థిక సహాయం అందించారు.. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లక్ష్మీ నరసింహ రెడ్డి, భారత రాష్ట్ర సమితి పట్టణ అధ్యక్షులు క్యామ వెంకటయ్య, సీనియర్ నాయకులు గంప శ్రీనివాస్, వార్డు సభ్యులు రామచంద్రయ్య, నాయకులు కుల పెద్దలు ఇప్పల కృష్ణయ్య, క్యామ జంగయ్య, చేగూరు మహేష్, కుకుట్ల మహేష్, కుకుట్ల శ్రీను, ఎల్లామోని జగన్, మూఢ రవి, కంబాల పల్లి అంజి, సిద్ధిగారి సురేష్, తదితరులు పాల్గొన్నారు.
ఇల్లు లేని నిరుపేద మహిళ కు బిఆర్ఎస్ చేయూత





