ఇద్దరు వ్యక్తులు దుర్మరణం

మెదక్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2 : మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన కొల్చారం వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాద వశాత్తు డివైడర్‌ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో కొల్చారం మండల కేంద్రంకు చెందిన ఆరిఫ్‌ (55) అక్కడికక్కడే మృతి చెందగా మాజీ వార్డు సభ్యుడు మహ్మద్‌ (48) హాస్పిటల్‌కి తరలించే క్రమంలో మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఇరువురు కౌడిపల్లి నుంచి కొల్చారం వొచ్చే క్రమంలో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెదక్‌ దవాఖానకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆరిఫ్‌, మహ్మద్‌ మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *