ఇదీ..‘సచ్‌..‌వాలయం’ అంటే ..!

  • డాక్టర్‌ ‌బి.ఆర్‌ అం‌బేద్కర్‌ ‌తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనాన్ని చూసి సీనియర్‌ ‌రిటైర్డ్ ఐఎఎస్‌ ఆఫీసర్స్ ‌సంభ్రమాశ్చర్యాలు
  • ఇందులో పనిచేస్తున్న ఐఎఎస్‌ అధికారులు ధన్యులని కితాబు
  • దేశానికే ఆదర్శంగా రాష్ట్ర పరిపాలనా సౌధ నిర్మాణమని ప్రశంస
  • అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందనీయుడని మెచ్చుకోలు
  • వారికి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు సహా సచివాలయ వివరాలు అందచేసిన సిఎస్‌ ‌శాంతి కుమారి. ఐఅండ్‌ ‌పీఆర్‌ ‌స్పెషల్‌ ‌కమిషనర్‌ ‌తదితర అధికారులు
  • డాక్టర్‌ ‌బిఆర్‌ అం‌బేద్కర్‌ ‌సచివాలయాన్ని సందర్శించిన రిటైర్డ్ ఆల్‌ ఇం‌డియా సర్వీస్‌ అధికారులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30 : అద్భుత నూతన సచివాలయ నిర్మాణాన్ని, రాష్ట్రంలో జరుగుతున్న అప్రతిహత అభివృద్ధిని రిటైర్డ్ అల్‌ ఇం‌డియా సర్వీస్‌ అధికారులు ప్రశంసించారు. రాష్ట్రంలో వివిధ హోదాలో పనిచేసి సేవలందించిన రిటైర్డ్ ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం సాయంత్రం డా. బీఆర్‌ అం‌బేద్కర్‌ ‌తెలంగాణ సచివాలయంలో తేనీటి విందునిచ్చారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి అధికారులు ప్రశంసించారు. సంక్షేమ, అభివృద్ది రంగాలలో తెలంగాణ రాష్ట్రం దేశంలో  ప్రథమ స్థానంలో నిలవడం తెలంగాణ ప్రజానీకానికి గర్వకారణం అని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

గత తొమ్మిదేళ్లలో సాధించిన రాష్ట్ర ప్రగతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులకు పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రెజెంటేషన్‌ ‌ద్వారా వివరించారు.ముఖ్యమంత్రి  ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి 1970 అనంతరం నుండి ఇటీవలి కాలం  వరకు రిటైర్‌ అయిన ఆల్‌ ఇం‌డియా సర్వీస్‌ అధికారులు పెద్ద సంఖ్యలో తమకుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారులు ఎ.కె.కుట్టి, సుజాతరావు, వి.పి.జవహరి, పి.సి.పరేఖ్‌, ‌కె.వి.రావు, రాజీవ్‌ ‌శర్మ, ఎస్‌.‌కె.జోషి, జై భరత్‌ ‌రెడ్డి, రస్తోగి, మిన్ని మాథ్యూస్‌, ఎ.‌కె.గోయల్‌, ‌దినకర్‌ ‌బాబు, జి.సుధీర్‌, ‌టి.ఎస్‌.అప్పారావు, జి.నాగి రెడ్డి, రేమండ్‌ ‌పీటర్‌ ‌లు ఉన్నారు. ముందుగా సచివాలయం ఎదుట గ్రూప్‌ ‌ఫోటో దిగిన అనంతరం రిటైర్డ్ అధికారులు కొత్తగా నిర్మించిన దేవాలయం, మస్జీద్‌, ‌చర్చి  లను సందర్శించారు.

అనంతరం, సెక్రెటేరియట్‌ ‌లోని 6 వ అంతస్తు తోపాటు వివిధ ఫ్లోర్‌ ‌లను తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా సీ.ఎస్‌ ‌శాంతి కుమారి మాట్లాడుతూ, దార్శనికులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అతి తక్కువ సమయంలో అద్భుతంగా ‘‘న భూతో నభవిష్యతి’’ అనే విధంగా సచివాలయ నిర్మాణాన్ని చేసిన విధానం, ఇందులోని ప్రత్యేకతలను సి.ఎస్‌ ‌వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఆమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రాలమలపై రూపొందించిన కాఫీ టేబుల్‌ ‌బుక్‌ ‌ను, యాదాద్రి ఆలయ ప్రసాదాలను రిటైర్డ్ అధికారులకు అందచేశారు . ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్‌ ‌కె.అశోక్‌ ‌రెడ్డి నేత్రుత్వంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పై వీడియో రూపంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సీనియర్‌ ఐఏఎస్‌, ఐపిఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారులు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *