ఇది హుస్నాబాద్‌ ఆత్మగౌరవ సభ : ఎమ్మెల్యే వొడితల సతీష్‌ ‌కుమార్‌

ఈ ‌నెల 15న సిఎం కేసీఆర్‌ ‌హాజరయ్యే సభ పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వొడితల సతీష్‌ ‌కుమార్‌ అన్నారు. బుధవారం అయన విలేఖరులతో మాట్లాడుతూ..‘ఇది ఒక ప్రతిష్టాత్మక సభ..ఇది హుస్నాబాద్‌ ‌ప్రజల ఆత్మగౌరవ సభ..హుస్నాబాద్‌ ‌నుండే ఎన్నికల ప్రచారాన్ని సిఎం కేసీఆర్‌ ‌ప్రారంభించబోతున్నారు…
ఇది ఒక చారిత్రక సందర్భం..మూడోసారి గులాబీ పార్టీ అధికారాన్ని చేపట్టబోతుంది..హుస్నాబాద్‌ ‌ప్రాంతాన్ని..అభివృద్ధి చేసి సస్యశ్యామలం చేసిన ఘనత సిఎం కేసీఆర్‌ ‌దే..బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానిదే అని అయన అన్నారు. గులాబీ సభ విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు సన్నద్ధమవుతున్నారు’ అని పేర్కొన్నారు. దేశంలోనే ఎక్కడలేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణాలో అమలవుతున్నాయని, పెద్ద ఎత్తున జనం తరలివచ్చి సభను విజయవంతం చేయాలని అయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *