న్యూ దిల్లీ, జూలై 24 : పాఠశాలలో ఇకపై సీబీఎస్‌ఈ సిలబస్ ని తెలుగులో కూడా బోధిస్తారు. ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లో బోధన జరుగుతుండగా.. కొత్తగా బోధన డియం భాషలుగా తెలుగుతో పాటు రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో గుర్తించిన మరో 21 భాషలను చేరుస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రాంతీయ భాషలు, వివిధ మాతృభాషలు బోధనభాషల్లో చేరిన నేపథ్యంలో విద్యార్థులకు భాషాపరమైన వైవిధ్యం, సమగ్రమైన బోధన అనుభవం లభిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు.
ఆంగ్లం, హిందీలతో పాటు ఇతర భాషల్ని కూడా బోధనకు పరిగణించాలని ఇటీవల విడుదల చేసిన ఓ సర్కులర్‌లో సీబీఎస్‌ఈ తమ పాఠశాలలకు సూచించిన సంగతి తెలిసిందే. విద్యావ్యవస్థలో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం కల్పించాలన్న జాతీయ విద్యావిధానం(ఎన్‌ఈపీ) మార్గదర్శకాలను అనుసరించి బోర్డు తాజా నిర్ణయాన్ని తీసుకుందని ప్రధాన్ తెలిపారు. కాగా.. తాజా మార్పుకు అనుగుణంగా ఎన్‌సీఈఆర్‌టీ ఆయా భాషల్లో పాఠ్య పుస్తకాలను తీసుకురానుంది…


