ఇం‌ద్రకరణ్‌రెడ్డి సమక్షంలో భారీగా చేరికలు

నిర్మల్‌, ‌సెప్టెంబర్‌ 13 : ‌శాస్త్రినగర్‌ ‌క్యాంపు కార్యాలయంలో నర్సాపూర్‌ ‌మండలం కేంద్రం, రాంపూర్‌ ‌గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్‌ ‌నాయకులు, కార్యకర్తలు, ముదిరాజ్‌ ‌సంఘం నాయకులు మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజాసంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి నేతలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరుతున్నారని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అత్యధిక మెజార్టీతో హ్యాట్రిక్‌ ‌విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కలిసికట్టుగా పార్టీ కోసం కృషి చేసి నిర్మల్‌ ‌నియోజకవర్గ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని, భవిష్యత్‌లో మరింత అభివృద్ధి చేసుకుందామని మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *