ఇం‌డిగో విమానంలో నైజీరియన్‌కు గుండెపోటు

  • అత్యవసరంగా కరాచీలో ల్యాండ్‌
  • అప్పటికే చనిపోయినట్లు వైద్య బృందం ప్రకటన

న్యూ దిల్లీ, మార్చి 13 : గుండెపోటు మరణాలు ఇప్పుడు విమానంలోనూ మొదలయ్యాయి..దిల్లీ నుంచి దోహా వెళుతున్న విమానంలో.. నైజీరియా దేశానికి చెందిన ఓ వ్యక్తి చనిపోవటం షాక్‌ ‌కు గురి చేసింది. సోమవారం ఉదయం.. ఢిల్లీ నుంచి దోహా బయలుదేరిన ఇండిగో .. బయలుదేరిన 30 నిమిషాల్లోనే.. విమానంలోని 60 ఏళ్ల అబ్దుల్లా అనే  ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. విషయాన్ని గమనించిన హెయిర్‌ ‌హోస్టర్స్.. ‌సమాచారాన్ని పైలెట్స్ ‌వివరించారు. పైలెట్లు మెడికల్‌ ఎమర్జెన్సీ కింద.. పాకిస్తాన్‌ ‌లోని కరాచీలో విమానాన్ని అత్యవసరంగా దించారు. కరాచీలో దిగే సమయానికి మెడికల్‌ ‌టీం రెడీగా ఉంది. అస్వస్థతకు గురైన వ్యక్తికి పరీక్షలు చేయగా అతను మరణించినట్లు ప్రకటించారు డాక్టర్లు.

దీంతో ఆ వ్యక్తి మృతదేహంతో తిరిగి విమానం ఢిల్లీకి చేరుకుంది. అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విమాన ప్రయాణికులను మరో విమానంలో దోహా పంపించనట్లు ప్రకటించింది ఇండిగో యాజమాన్యం. షెడ్యూల్‌ ‌ప్రకారం ఉదయం 11 గంటలకు దుబాయ్‌లో విమానం ల్యాండ్‌ ‌కావాల్సి ఉంది. విమానంలోని ప్రయాణికుడు గుండెపోటుతో చనిపోవటంతో.. ప్రయాణికులు తిరిగి దిల్లీకి చేరుకున్నారు. విమానంలో ప్రయాణికుడి మరణంపై ఎయిర్‌ ‌పోర్ట్ అథారిటీ విచారం వ్యక్తం చేసింది. సరైన సమయంలో చికిత్సకు ఏర్పాట్లు చేసినాఫలితం లేదని.. అతని కుటుంబానికి తీరని లోటను స్పష్టం చేసింది. మిగతా ప్రయాణికుల విషయంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నామని.. ఇది అనుకోని ఘటన అని వివరించింది ఇండిగో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *