ఎల్. బి. నగర్, ప్రజాతంత్ర , అక్టోబర్ 7: ఎల్. బి నగర్ నియోజకవర్గ పరిధిలోని బి.యన్.రెడ్డి.నగర్ డివిజన్ లో రూ.9 కోట్ల 21లక్షల 30 వేల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి శంకుస్థా పన చేశారు. గాయత్రి నగర్ ఫేస్ 2, ఫేస్ 3 ఫేస్ 4 కాలనీల లో డ్రైనేజీ లైన్స్ పనులు , శ్రీగాయత్రి నగర్ కాలనీలో డ్రైనేజీ లైన్స్ ,భవాని ఎన్క్లేవ్ కాలనీలో డ్రైనేజీ లైన్స్ , గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ – డ్రైనేజీ లైన్స్ పనులకు శంకుస్థాపన చేశారు. ఆలాగే గాయత్రీ నగర్ – మారుతీ నగర్ కాలనీలో డ్రైనేజీ లైన్స్ , వెంకటేశ్వరా కాలనీలో డ్రైనేజీ లైన్స్, బృందావన్ మిడౌస్ (జక్కిడి నగర్ -జక్కిడి రాంచంద్రా రెడ్డి ) కాలనీలో డ్రైనేజీ లైన్స్, శ్రీ సిద్ధి వినాయక హిల్స్ కాలనీలో డ్రైనేజీ లైన్స్ ,సామ నగర్ కాలనీలో డ్రైనేజీ లైన్స్ ,ఆఫీసర్స్ కాలనీలో డ్రైనేజీ లైన్స్ ,గౌతమి నగర్ కాలనీలో డ్రైనేజీ లైన్స్ ,గాంధీ నగర్ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం ,దుర్గా సాయి నగర్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణం ,ఎస్. డి. కే నగర్ కాలనీలో సీ.సీ.రోడ్డు నిర్మాణం ,సాగర్ హౌసింగ్ కాంప్లెక్స్ ఫేస్ 1 కాలనీలో హెచ్ఎండిఏ పార్క్ ప్రారంభం,కమ్యూనిటీ హాల్ ప్రారంభం,డ్రైనేజీ లైన్స్ శంకుస్థాపన,చైతన్య నగర్ కాలనీలో కమ్యూనిటీ హాలు మొదటి అంతస్తు నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు .ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ… నియోజకవర్గ అబివృద్దే తన లక్ష్యం అని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేయడం జరుగుతుందని అన్నారు. నియోజకవర్గన్నీ అభివృద్ధి చేసి ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రజలకిచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునన్నారు.అనితర సాధ్యమైన రిజిస్ట్రేషన్ సమస్యను 118 జీ.ఓ.తో పరిష్కరించబడిందని తెలిపారు. వేలకోట్లతో ఎల్.బి.నగర్, సాగర్ రోడ్డు లో ఫ్లై ఓవర్లు,అండర్ పాస్ లు,స్కైఓవర్లు నిర్మాణం చేశామని తెలిపారు. ప్రజలంతా చర్చించుకొని తనను మరోసారి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలని విజ్ఞప్తి చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఇట్టి కార్యక్రమంలో కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి,బి.యన్.రెడ్డి.నగర్ డివిజన్ బారాస పార్టీ అధ్యక్షులు కటికరెడ్డి అరవింద్ రెడ్డి,మాజీ మార్కెట్ డైరెక్టర్ అనిల్ చౌదరి,సామ బుచ్చిరెడ్డి,శ్రీధర్ గౌడ్,ఉమేష్ గౌడ్,శివశంకర్,మువ్వ సతీష్,గడ్డం మల్లేష్,పొగుల రాంబాబు,రాఘవేంద్రరావు
డివిజన్ పరిధిలోని పార్టీ సీనియర్ నాయకులు,ఉద్యమకారులు,పలు విభాగాల కమిటీ సభ్యులు,మహిళలు,కార్యకర్తలు,పా ర్టీ అభిమానులు,వివిధ కాలనీ అధ్యక్ష,కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.





