ఆలస్యం జరిగింది…వర్షాలు పడుతాయి

  • ప్రజల పూజలు సంతోషంగా అందుకుంటున్నా
  • రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వెల్లడి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 10 : సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా జరుగుతున్నది. సోమవారం అమ్మవారి బోనాల కార్యక్రమంలో భాగంగా కీలక ఘట్టమైన రంగం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ’ప్రజలు చేసిన పూజలు సంతోషంగా అందుకున్నా. గతేడాది వి•రు ఇచ్చిన వాగ్దానం మరిచారు. కావాల్సిన బలాన్ని ఇచ్చాను..వి•వెంటే నేను ఉంటా. వర్షాలు తప్పనిసరిగా వొస్తాయి. వి•రు భయపడవద్దు. ఆలస్యమైనా వానలు తప్పనిసరిగా వస్తాయి. ప్రజలు ఎలాంటి భయాందోళన చెందవద్దు. ఐదు వారాలు తప్పనిసరిగా నైవేద్యాలు సమర్పించాలి. ఏ పూజలు చేసినా సంతోషంగా అందుకుంటున్నా’ అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.

కాగా, రంగం కార్యక్రమం నేపథ్యంలో మహంకాళి ఆలయంలో భక్తులకు అమ్మవారి దర్శనం నిలిపివేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌పాల్గొన్నారు. భవిష్యవాణి వినేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరకు ఎలాంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు జరిగాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌  అన్నారు. అమ్మవారు భవిష్యవాణిలో బోనాల కార్యక్రమం బాగా జరిగిందని చెప్పడం సంతోషంగా ఉందని చెప్పారు. రాష్ట్ర పండుగ అయిన బోనాలకు అన్ని శాఖలు సహకరించాయని తెలిపారు. బోనాలకు సహకరించిన అన్ని విభాగాలకు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *