ఆలయాల్లో వైకుంఠ సందడి

ఉత్తర ద్వార దర్శనాలకు పోటెత్తిన భక్తులు
యాదాద్రీశుడిని దర్శించుకున్న మంత్రి తుమ్మల

యాదాద్రి,డిసెంబర్‌23: ‌తెలంగాణలోని  పలు ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాలు కిటకిటలాడాయి. ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు శనివారం తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాల దగ్గర బారులు తీరారు. యాదగురిగుట్టలో ఉదయం 6.42 గంటలకు ఉత్తర రాజగోపురం చెంత నరసింహుడు మహావిష్ణువు రూపంలో దర్శనమిచ్చారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్‌ ‌బీర్ల అయిలయ్య కుటుంబసభ్యులతో నరసింహస్వామిని దర్శించుకున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. గరుడ వాహనంపై శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారు ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. భద్రాచలంలోనూ అధ్యయనోత్సవాల్లో భాగంగా వైకుంఠ ఏకాదశి వేడుకలను నిర్వహించారు. వైకుంఠ ద్వారం గుండా దర్శనమిస్తున్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.

వేములవాడ రాజన్న ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా హరిహరులు భక్తులకు దర్శన మిచ్చారు. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ‌స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యేలు లక్ష్మణ్‌ ‌కుమార్‌, ‌వివేక్‌ ‌వెంకటస్వామి పాల్గొని, స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరిగాయి. వైకుంఠ ఏకాదశికి జిల్లాలోని వైష్ణవాలయాలు ముస్తాబయ్యాయి. సిద్దిపేట లోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో స్వామి వారిని మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో హరీష్‌ ‌రావుకు స్వాగతం పలికారు. దుబ్బాక పట్టణంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో ఘనంగా వైకుంఠ ఏకాదశి పూజలు జరిగాయి. ఆ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు.వరంగల్‌ ‌జిల్లాలోని ఆలయాలన్నీ గోవింద నామస్మరణతో మారుమోగు తున్నాయి. వరంగల్‌ ‌చౌరస్తాలోని గీతా భవన్‌లో వేంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. కాశిబుగ్గలోని రంగనాయక స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇక వరంగల్‌లో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. బట్టల బజార్‌లోని బాలానగర్‌ ‌వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు.

వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యే తుడి మెగారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా జడ్చర్లలో వెంకటేశ్వర స్వామి, గంగాపురంలో శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాలలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని భక్తులు దర్శించు కున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయం లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరిగాయి. ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు హరి హరులు దర్శనం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ విప్‌ అది శ్రీనివాస్‌ ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు.జగిత్యాల జిల్లాలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్‌, ‌ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ ‌కుమార్‌, ‌చెన్నూర్‌ ఎమ్మేల్యే గడ్డం వివేక్‌ ‌వెంకటస్వామి దంపతులు పాల్గొని ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు.వైకుంఠ ఏకాదశి సందర్భంగా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తెల్లవారుజామున 2.30 గంటల నుంచే స్వామివారి మూల విరాట్లకు మహా క్షీరాభిషేకం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. సంగారెడ్డి వైకుంఠపురంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా నిర్వహించిన పల్లకి సేవలో మంత్రి దామోదర రాజనర్సింహ దంపతులు పాల్గొన్నారు.ఉత్తర ద్వారం గుండా గరుడవాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *