జగదేవపూర్, ప్రజాతంత్ర, జులై 17: జగదేవపూర్ మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్ లో ఆర్యవైశ్య సేవా సమితి సహకారం తో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్యవైశ్య సేవాసమితి సభ్యులు మాట్లాడుతూ… ప్రతి నెల అమావాస్య రోజున పెద్దల జ్ఞాపకార్థం గా 300 వందల మందికి పైగా అన్నదానం నిర్వహించడం జరుగుతుందని అన్నారు.అదే విధంగా ఇప్పటికీ 16 నెలలు కు పూర్తి కావస్తుందని అన్నారు.ఇకపై ముందు ముందు కూడా ఇదే విధంగా కొనసాగుతూ ఉంటామని ఆ వాసవి మాత అనుగ్రహం ఉండాలని కోరుకుంటామని అన్నారు.ఈ కార్యక్రమం లో మండల ఆర్యవైశ్య సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




