ఆర్మూర్‌ ‌హాస్పిటల్‌ను మంత్రి ఆకస్మిక తనిఖీ…

ఆర్మూర్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : ఆర్మూర్‌ ‌హాస్పిటల్‌లో మంత్రి హరీష్‌రావు ఆకస్మికంగా తనిఖీలు  నిర్వహించారు. అక్కడి రోగులతో మాట్లాడారు. ప్రతీ వార్డుకెళ్లి వైద్య సేవలపై ఆరా తీశారు. ఆపై డాక్టర్లు, వైద్య సిబ్బందితో సవి•క్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ…ఆర్మూర్‌ ‌హాస్పిటల్‌లో మందుల కొరత లేదన్నారు. వారం పదిరోజుల్లో డయాలిసిస్‌ ‌సెంటర్‌..

అతి త్వరలో డాక్టర్లు, వైద్య సిబ్బంది ఖాళీలు భర్తీ చేస్తామని తెలిపారు. నార్మల్‌ ‌ప్రసవాలు ప్రోత్సహించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. నెలకు 500 ఫ్రీ డెలివరీలు జరగాలని టార్గెట్‌ ‌విధించారు. హాస్పిటల్‌లో ఇప్పటికే జరిగిన 22,670 ఉచిత ప్రసవాలు అభినందనీయమని మంత్రి హరీష్‌ ‌రావు కొనియాడారు. హాస్పిటల్‌లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యే జీవన్‌ ‌రెడ్డి కూడా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *