ఆర్ధిక మాంద్యంలో ఆహారం కోసం అలజడులు

ప్రంచమంతా ఆర్థిక సంక్షోభం దిశ గా పయని స్తున్నది. పలు దేశాల్లో ఈ సంక్షోభం మరింత తీవ్రస్థాయిలో ఉంది. పాక్‌,‌శ్రీలంక వంటి దేశాలు ఆహారం లేక అలమటిస్తున్నాయి. అగ్రరాజ్యాలు కూడా దీనికి అతీతం కాదు. ఆర్ధిక పతనం అంచున ఉన్న కొన్ని  దేశాలు తమ డొల్లతనాన్ని కప్పి పుచ్చుకోవడానికి పలు ప్రయత్నాలు ఆరంభించాయి.చమురు కొరతతో పలు దేశాల ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలి పోతు న్నాయి. ప్రజల అవసరాలు తీర్చలేక చతికిల బడుతున్న  ప్రపంచ  ఆర్ధిక స్థితిగతు లను,వాటికి గల కారణాలను కూలంకషంగా విశ్లేషించుకుని, ఆయా దేశాలు ఎదుర్కొంటున్న విషమ పరిస్థితులను పాఠాలుగా, గుణపాఠాలుగా తీసుకుని, భవిష్యత్తులో ఎలాంటి ఆర్ధిక వ్యూ హాలను అనుసరించాలో, ఎలాంటి ఆర్ధిక ప్రణాళి కలతో ముందుకు సాగాలో అనే అంశంపై మేథోమధనం జరగాలి. ఇప్పటికే భారత దేశం అనేక సంక్షోభాలను అవలీలగా ఎదుర్కొన్నది.
ఎన్నో సహజమైన వనరులతో, మానవనరులతో, వ్యవసాయ భూములతో, యువత  కష్టించే మనస్తత్వంతో భారత దేశం ఎన్నో  క్లిష్టమైన  పరిస్థితులనుండి బయటపడడం జరుగుతున్నది. సంపన్న దేశాల ఆర్థిక వ్యవస్థలను, ఆయా దేశాల ఆర్ధిక సూత్రాలను గుడ్డిగా అనుసరించకుండా, భారత దేశ ప్రజల విశాల ప్రయోజనాలను కాపాడే విధంగా ఆర్ధిక ప్రణాళికలను, వ్యూహాలను అనుసరించడం వలన భారతదేశం చాలా వరకు  సురక్షితంగా ఉంది.శ్రీలంక జాంబియా, లెబనాన్‌ ‌రష్యా, ఉక్రెయిన్‌,‌పాకిస్తాన్‌  ‌వెనిజులా, యు.కె. తదితర దేశాలు ఆర్ధిక సంక్షోభంతో సతమతమవుతున్నాయి. చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయిలో ఉంది. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గింది. మరి కొన్ని దేశాల్లో నిత్యావసర వస్తువుల కొరత,ఔషధాల కొరతతో ప్రజలు నిత్యనరకం అనుభవి స్తున్నారు.ఆహార ధాన్యాలు,చమురు ధరలు చుక్కల నంటుతున్నాయి. అన్నమో రామచంద్రా ! అంటూ  ప్రజలు రోడ్డున పడుతున్నారు. అమెరికాలో డాలరు బలపడుతున్న భ్రమలున్నా, తెలి యని ఆర్ధిక మాంద్యపు ఛాయలు అగ్రరాజ్యాన్ని వెంటాడుతున్నాయి. ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లడం,రెసిషన్‌ ‌కారణంగా కొంతమందిని ఉద్యోగాల నుండి తొలగించడం కూడా జరుగుతున్నది.కోవిడ్‌ ‌వలన  అమెరికా ఆర్ధికంగా తీవ్రంగా దెబ్బతిన్నది. అమెరికా అప్పు 30 ట్రిలియన్ల డాలర్లకు  చేసుకున్నట్లు తెలుస్తున్నది.
భవిష్య పరిణామాలు ఇలాగే కొనసాగితే యు.ఎస్‌. ఆదాయం లో సగం వడ్డీలకే సరిపోతుందన్న అభిప్రాయం ఉంది.యు.ఎస్‌. 20.89 ‌ట్రిలియన్ల డాలర్ల జి.డి.పితో చైనా 14.72, జపాన్‌ 5.6 ‌జర్మనీ  3.85,  ఇండియా 3.5  ట్రిలియన్‌ ‌డాలర్ల జి.డి.పితో ప్రపంచంలో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థలుగా అవతరించినట్టు గణాంకాలు తెలియచేస్తున్నాయి. అగ్రరాజ్యాలు కూడా ఆర్ధికంగా కుదుపులకు లోనవడం వాటి అంతర్గత ఆర్ధిక స్వరూపం లో ఏవో లోపాలున్నా యని అర్థమౌతున్నది. అగ్రరాజ్యాలు  కూడా ఇబ్బందులకు గురికావడం వెనుక నేపథ్యం అవగతం చేసుకోవాలి. కోవిడ్‌ ‌కు జన్మస్థలి అయిన  చైనా కోవిడ్‌ ‌సంక్షోభం వలన  ఇప్పటికీ ఆర్ధికంగా ఎన్నో అంతర్గత సంక్షోభాలను ఎదుర్కొంటున్నది. చైనా  అప్పులు రెండున్నర లక్షల కోట్ల డాలర్లుగా కొంత మంది విశ్లేషకుల  అంచనా. బాహ్య ప్రపం చానికి చైనా  తన ఆర్ధిక ముఖచిత్రాన్ని వెల్లడి కాకుండా ముసుగు వేస్తున్నట్లు పరిశీలకుల వాదన.అమెరికా, చైనా రుణాలు చాలా దేశాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని, చీటికీ మాటికీ  అగ్ర రాజ్యాలపై ఆధారపడే  దేశాలపై కూడా  ఆర్ధిక సంక్షోభ ఛాయలు ముసురు కుంటు న్నాయని,  అనేక కథనాలు వినబడు తున్నాయి.బ్రెగ్జిట్‌ ‌ఫలితంగానూ,కరోనా వలన ఏర్పడిన పరిణామాల వలన పాలకులు ఎంతమంది మారినా యు. కె.  ఇప్పట్లో కోలు కోలేని  ఆర్ధిక సంక్షోభం లోకి జారి పోయింది.
1929-39 సంవత్సరాల మధ్య ప్రపంచంలో పెద్ద ఆర్ధిక సంక్షోభం ఏర్పడింది.  తిరిగి అలాంటి ఆర్ధిక మాంద్యం ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నది. 2007 మరియు 2009 వ సంవత్సరాల్లో గ్లోబల్‌ ‌ఫైనాన్షియల్‌ ‌క్రైసెస్‌ ‌లు  సంభవించాయి.1973 వ సంవత్సరంలో ఒపెక్‌ ‌దేశాలు అమెరికా దాని మిత్ర దేశాలకు చమురు సరఫరా చేయరాదని నిర్ణయించడంతో అరబ్‌ – ఇ‌జ్రాయెల్‌ ‌యుద్ధ సమయంలో అమెరికా తో పాటు పలుదేశాలు తీవ్ర సంక్షోభం ఎదుర్కొన్నాయి.1991 లో కువైట్‌ ‌పై ఇరాక్‌ ‌దాడికి నిరసనగా అమెరికా సంకీర్ణ దేశాలు  యుద్ధం ప్రకటించాయి. ఈ సందర్భంగా  స్వల్ఫకాలం పాటు కొన్ని దేశాలు కష్టాలు అనుభవించాయి.భారత దేశంలో అనేక సందర్భాల్లో ఆర్ధిక మాంద్యం ఏర్పడిన మాట వాస్తవం.1991 లో ఇండియా ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొన్నది. ఇదే సందర్భంలో  చంద్ర శేఖర్‌ ‌ప్రధానిగా ఉన్న కాలంలో ప్రపంచ బ్యాంకు,ఐ.ఎమ్‌.ఎఫ్‌ ‌లు భారత్‌ ‌కు రుణాలివ్వడానికి అంగీకరించలేదు. భారత్‌ ‌బంగారాన్ని తాకట్టు పెట్టవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత వచ్చిన పి.వి.నరసింహారావు ఎన్నో ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టి భారత దేశాన్ని ఆర్ధికంగా గట్టెంకించారు. అయితే పి.వి.నరసింహారావు చేపట్టిన  ఆర్ధిక సంస్కరణలకు స్వంత పార్టీ లోనే తగిన గుర్తింపు లభించకపోవడం శోచనీయం.
భారతదేశం వాస్తవంగా శక్తి వంతమైన దేశం. ఈ కారణం గానే అనేక సంక్షోభాలను ఆవలీలగా ఎదుర్కోవడం జరుగుతున్నది. భారత దేశం ఇంధన రంగంలో స్వయం స్వావలంభన సాధిస్తే  చాలా వరకు ఆర్ధిక సంక్షోభ పరిస్థితులను అధిగమించవచ్చు. ప్రస్తుత రష్యా,ఉక్రెయిన్ల మధ్య కొనసాగుతున్న యుద్ధంలో భారత్‌ ‌ను ఇబ్బంది పెట్టాలని కొన్ని దేశాలు ప్రయత్నాలు చేసి,విఫలమయ్యాయి.  రష్యాపై జి-7 దేశాల ఆంక్షలను భారత్‌ ‌వ్యతిరేకించడం వలన రష్యా భారత్‌ ‌కు మరింత సన్నిహితమయ్యే అవకాశాలు ఏర్పడ్డాయి. దీని వలన భారత్‌ ‌కు తక్కువ ధరలకే చమురు ఉత్పత్తి చేయడం భారత్‌ ‌విదేశీ వ్యూహాలకు దక్కిన విజయంగా పేర్కొనడం లో ఎలాంటి సందేహం లేదు. అనేక క్లిష్టమైన సందర్భాల్లో రష్యా మనకు అండగా నిలబడి సహాయం చేసి ఇండో-రష్యా చిరకాల మైత్రికి నిదర్శనంగా మిగిలింది.రాబోయే మరికొద్ది సంవత్సరాల పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆర్ధిక మాంద్యం  కొనసాగే అవకాశాలున్నాయి.  ఇందుకు అన్ని దేశాలు సంసిద్ధంగా ఉండాలి. మరో ఏడాదిలో చైనా జనాభాను అధిగమించి, ప్రపంచంలో అతి పెద్ద జనాభా గల దేశంగా ఆవిర్భవించనున్న భారత్‌ ‌ప్రపంచ పరిణామాలను నిరంతరం అధ్యయనం చేస్తూ, ఆర్ధిక క్రమశిక్షణ పాటిస్తూ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను,ప్రజలను అప్రమత్తం చేయాలి.  ఇలాంటి చర్యల వలన మధ్యతరగతి దిగువ మధ్య తరగతి ప్రజలపై భారం పడకుండా కాపాడవచ్చు.
image.png
సుంకవల్లి సత్తిరాజు   9704903463.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *