జగదేవపూర్, ప్రజాతంత్ర, జూలై 28: జగదేవపూర్ మండలంలోని మాందపూర్ గ్రామానికి చెందిన లింగాల లచ్చయ్య శుక్రవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ లింగాల భిక్షపతి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నర్సింలు,భిక్షపతి, పెద్దిరాజు,నర్సింలు, చంద్రయ్య.ముత్తయ్య తదితరులు ఉన్నారు.




