ఆర్టీసీ విలీనం బిల్లు.. గవర్నర్‌ ఆమోదం కోసం ఎదురుచూపులు ..

  • అసెంబ్లీలో బిల్లు పెట్టాలంటే అనుమతి తప్పనిసరి
  • ఆర్టీ కార్మికుల్లో ఆందోళన
హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్ 4: అసెంబ్లీలో ఆర్టీసీ విలీనం బిల్‌ ‌పై సస్పెన్స్ ‌కొనసాగుతోంది. మనీ బిల్‌ ‌కావడంతో.. గవర్నర్‌ ఆమోదానికి పంపించింది సర్కార్‌.  ‌బిల్లుకు గవర్నర్‌  ఆమోదం తెలపలేదు. దీంతో ప్రభుత్వం గవర్నర్‌ ‌మధ్య మరోమారు వివాదం చెలరేగే అశాకం ఉంది. బిల్లు ఆమోదం కోసం తెలంగాణ అసెంబ్లీ ఎదురుచూస్తోంది. న్యాయసలహా తీసుకొని సమస్యలు రాకుండా చూసుకునేందుకు ఆర్టీసీ విలీనం బిల్లు అనుమతికి సమయం కావాలని గవర్నర్‌ ‌తమిళిసై అన్నట్లు సమాచారం. కావాలనే గవర్నర్‌ ఈ ‌బిల్లుపై స్పందించలేదన్న విమర్శలపై ఆమె స్పందించారు. తనకు బిల్లు మొన్న  మధ్యాహ్నం అందిందని.. కొంత సమయం అవసరమని ఆమె స్పష్టం చేశారు.  అసెంబ్లీ సమావేశాలను శనివారంతో ముగించాలని సర్కార్‌ ‌చూస్తోంది. ఆర్టీసీ విలీన బిల్‌ ‌ను  ఇవాళ కానీ రేపు గానీ వస్తే.. ఆదివారం రోజు కూడా సభ నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒక వేళ  గవర్నర్‌ ‌శనివారం వరకు  ఆమోదించక పోతే ప్రభుత్వం ఏం చేస్తుందనే ఆసక్తిగా మారింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఇటీవల రాష్ట్ర కేబినెట్‌ ‌నిర్ణయించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఆసంస్థలో పనిచేస్తున్న 43 373 మంది ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.
టీఎస్‌ఆర్టీసీ బిల్లు వ్యవహారం  గవర్నర్‌, ‌గవర్నమెంట్‌ ‌మధ్య  మరోసారి వివాదం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో కీలకమైన బిల్లులు ఆమోదించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న టైంలో కొన్నింటికి గవర్నర్‌ ‌నుంచి ఆమోదం లభించకపోవడంతో వివాదానికి కారణవుతోంది.  టెక్నికల్‌గా ఇది ఆర్థిక బిల్లు అయినందున ముందు గవర్నర్‌ ‌పర్మిషన్‌ ‌తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.  అందుకే ఇప్పుడు ఈ బిల్లు అనుమతి కోసం గవర్నర్‌ ‌తమిళిసై వద్దకు పంపించి ప్రభుత్వం. ఈ సమావేశాల్లో కచ్చితంగా ఆర్టీసీ విలీనం బిల్లును ఆమోదించుకోవాలని భావిస్తోంది ప్రభుత్వం. శాసన సభ వర్షాకాల సమావేశాలను మూడు రోజుల్లో ముగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది.
అయితే ఇప్పటికే రెండు రోజులు సమావేశాలు పూర్తయ్యాయి. ఇంకొక రోజు మాత్రమే మిగిలి ఉంది. అయితే ఇంత వరకు గవర్నర్‌ ‌నుంచి ఆర్టీసీ విలీనం బిల్లుపై ఎలాంటి కదలిక లేదు.  దీనిపై బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారు. చాలా మంది పేదలకు న్యాయం చేద్దామని చూస్తుంటే రాజ్‌భవన్‌ ‌నుంచి సానుకూల స్పందన రాలేదంటున్నారు. మొదటి నుంచి గవర్నర్‌ ఇదే తీరున వ్యవహరిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.  బిల్లును ఆమోదించాలా లేదా అన్నది గవర్నర్‌ ఇష్టం. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు సమయం తీసుకునే అవకాశం ఉంది. ఆర్టీసీ బిల్లు విషయంలో గవర్నర్‌ అభ్యంతరం చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉంది. ఇలాంటి సమయంలో.. బిల్లు విషయంలో న్యాయపరమైన సలహా తీసుకోవడానికి తమిళిసై ప్రయత్నిస్తున్నారు. ఈ •ప్రక్రియ వారం రోజులపైగా సాగితే.. ప్రభుత్వ ప్రయత్నాలకు ఇబ్బంది ఎదురయినట్లే అనుకోవచ్చు.

 నేడు ’చలో రాజ్‌ ‌భవన్‌’:ఆర్టీసీ ఉద్యోగులు
మరో వైపు గవర్నర్‌ ‌బిల్లును పెండింగ్‌లో  పెట్టడంపై ఆర్టీసీ ఉద్యోగులు మండిపడుతున్నారు. శనివారం  ’చలో రాజ్‌ ‌భవన్‌’ ‌కార్యక్రమం చేపట్టాలని  ఆర్టీసీ ఉద్యోగులు నిర్ణయించారు.  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లుకు ఆమోదం తెలుపని తెలంగాణ గవర్నర్‌ ‌తమిళిసై.. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు నేడు  చలో రాజ్‌ ‌భవన్‌ ‌కార్యక్రమం నిర్వహించనున్నారు.  కేబినెట్‌ ‌నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బిల్లు రూపొందించింది. ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ విలీనం బిల్లు పాస్‌ ‌చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.  రాష్ట్ర సర్కారుపై వ్యతిరేక వైఖరితోనే ఆర్టీసీ బిల్లును గవర్నర్‌ ఆపుతున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల్లో అధిక శాతం బడుగు, బలహీన వర్గాలు, పేదలే ఉన్నారు. అలాంటి వారిని ఇబ్బంది పెట్టేలా గవర్నర్‌ ‌వ్యవస్థ వ్యవహరించడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *