ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

 21 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని నిర్ణయం
జూన్‌ 1 నుంచి కొత్త ఫిట్‌మెంట్‌ అమలు
కొత్త ఫిట్‌మెంట్‌తో ఆర్టీసీకి నెలకు రూ.35 కోట్ల భారం
53,071 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం
మహాలక్ష్మి పథకంలో 3 నెలల్లో 25 కోట్ల మహిళల జర్నీ
రవాణాశాఖ మంత్రి పొననం ప్రభాకర్‌ వెల్లడి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 9 :  కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హావిూలు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో రెండు గ్యారంటీ స్కీమ్స్‌ అమలు చేసిన సర్కార్‌.. ఇటీవల పేదలకు ఎంతగానో ఉపయోగపడే రూ.500 కే గ్యాస్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అమలు చేసింది. ఇప్పుడు తాజాగా టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది. ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించామని.. జూన్‌ 1 నుంచి కొత్త ఫిట్‌మెంట్‌ అమలులోకి వస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. కొత్త ఫిట్‌మెంట్‌తో ఆర్టీసీకి నెలకు రూ.35 కోట్ల భారం పడనుందని చెప్పారు. అయితే 53,071 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూరు తుందని మంత్రి వెల్లడిరచారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు మహాలక్ష్మి పథకం అమలుకు సిద్ధమయ్యారని… విజయవంతం చేశారని కొనియాడారు. 3 నెలల్లో 25కోట్ల మహిళలు ఇప్పటి వరకు ప్రయాణం చేశారన్నారు. అందుకు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ సంస్థ ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నా మని చెప్పారు. గతంలో ప్రావిడెంట్‌ ఫండ్‌ను వాడుకున్నారని.. బాండ్స్‌ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్నారన్నారు. ఇప్పుడు 2017 పీఆర్సీని పూర్తి స్థాయిలో ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఆర్టీసీ నష్టాల నుంచి ప్రాఫిట్‌ ఒరిఎంటేషన్‌ వైపుగా వెళ్తున్నాంమన్నారు. రిటైర్మెంట్‌ 21శాతం ఇవ్వాలని నిర్ణయించామని… దీనివల్ల ఏడాదికి భారం పడుతుంది.. అయినా కూడా ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులకు సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి చెప్పుకొచ్చారు. పేద ప్రజలకు ప్రయాణం సాధనం ఆర్టీసీ అన్నారు.
ఆర్డినరీ బస్సులకు ఎక్స్‌ప్రెస్‌ బస్సుల కలర్స్‌ వేసి నడపుతున్నాం అనటం వాస్తవం కాదన్నారు. ఆటో కార్మికులకు కొంత అన్యాయం జరిగిందని.. వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. శవాల విూద పేలాలు ఏరుకునే విధంగా మాజీ మంత్రులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ‘గతంలో ఉన్న మాజీ మంత్రులు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.. కానీ మమ్మల్ని ఆటో కార్మికులకు 15000 ఇవ్వాలని కోరుతున్నారు‘ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్‌ వ్యాఖ్యలు చేశారు.  కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన 48గంటల్లో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని.. దాన్ని అమలు చేయడంలో ఆర్టీసీ బాధ్యతను నెరవేరుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. పెండిరగ్‌లో రూ.280కోట్ల బాండ్స్‌ నెక్లెస్‌ రోడ్డులో సీఎం, డెప్యూటీ సీఎం ప్రకటించారు. రెండు రోజుల్లోనే పేమెంట్స్‌ జరుగుతాయన్నారు. కార్మికులకు బోనస్‌, ఇతర బెనిఫిట్స్‌ ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నామన్నారు. 21శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని.. దాంతో ప్రతి ఏటా రూ.418.11కోట్ల భారం పడుతుందన్నారు. ఆర్టీసీ కుటుంబాలు తమకు మద్దతు తెలిపాయన్న మంత్రి.. వారికి అండగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జూన్‌ ఒకటి నుంచి అమలులోకి వస్తుందన్నారు. మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత బస్‌లు, బస్టాండులు కళకళలాడుతున్నాయన్నారు. 60శాతం ఉన్న ఆక్యుపెన్సీ వందశాతం దాటుతుంద న్నారు. ఇకపోతే ఆర్టీసీలో నూతన ఉద్యోగ నియామకాలు చేపడుతామని మంత్రి తెలిపారు. మూడువేల బస్సులు కొత్తగా వస్తున్నాయని.. ఎక్కడ కూడా బస్సులు తగ్గించే పరిస్థితి ఉండదన్నారు. సంస్థను ముందుకు తీసుకువెళ్లేందుకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 16 నుంచి పిట్‌మెంట్‌ 21శాతానికి పెంచేందుకు కృషి చేసిన సీఎం, ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. 53,071 మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. భారీ ప్రకటనలో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం విలీనంపై పరిశీలిస్తుందన్నారు. బస్సులు పెంచుతున్నామని.. కొత్త రూట్లలో బస్సులు నడపాలని డిమాండ్స్‌ వస్తున్నాయన్నారు. ప్రభుత్వం, మంత్రిపై కోపం ఉంటే వేరే పద్ధతిలో వెళ్లాలని.. ఆర్టీసీపై విమర్శలు ఆపాలని విజ్ఞప్తి చేశారు. గ్రావిూణ ప్రాంతాల్లో రైల్వేలాగా ఆర్టీసీ బస్సులు పని చేస్తున్నాయ న్నారు. ఆర్టీసీని బ్లేమ్‌ చేయాలని చూస్తున్నారని.. ఆర్టీసీకి మహిళలకు ఉచితంగా ఇస్తుంటే.. ఆటో వాళ్లని రెచ్చగొడుతున్నారన్నారు. ఎవరికి ఏఏ డిపార్ట్‌మెంట్‌లు, ఎన్ని పోస్టులు వస్తున్నాయనేది డీటైల్స్‌ ఇస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *