– ఈ జనవరి నుండి 2.1% డీఏ పెరుగుదల
– ప్రకటించిన రవాణా శాఖ మంత్రి పొన్నం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారికి సంబంధించిన ఏకైక పెండింగ్ డీఏను ప్రభుత్వం విడుదల చేసింది. జనవరి 2026 నుండి 2.1 శాతం పెరిగిన డీఏ అమలులోకి వచ్చింది. దీంతో సవరించిన డీఏ వల్ల 52.8 శాతానికి చేరింది. జనవరి నుండి ఇవ్వాల్సిన పెండింగ్ డీఏలు వచ్చే మూడు నెలలకుగాను ఒక్కో నెలలో విడుదల చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీలో పెండింగ్ పనులు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆర్ఎంలతో మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. పెండింగ్ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన ప్రభుత్వంలో మొదటి నుండి ఆర్టీసి సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌల్యభం కేంద్రంగా పనిచేస్తున్నదన్నారు. సంస్థకు ప్రధానంగా కార్మికుల సంక్షేమంపై వారికి సంబంధించిన ఆరోగ్య సంరక్షణకు హాస్పిటల్ అభివృద్ధి, కారుణ్య నియామకాలు, దీర్ఘకాలంగా తొలగింపునకు గురైన వారిని త్రీమెన్ కమిటీ ద్వారా తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవడం, కొత్త నియామకాలు చేపట్టి పని భారం తగ్గించడం, కొత్త బస్సులు కొనుగోలు వంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నదని ఆయన వివరించారు. పెండింగ్‌లో ఉన్న డీఏ 2.1 శాతం పెంచడం వల్ల గతంలో ఉన్న 50.7 శాతం నుండి 52.8 శాతానికి పెరిగిందన్నారు. చివరగా జూలై 2025లో 2.1% డీఏను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. జూలై 2025లో 48.6% నుండి 50.7%కి పెరగగా ప్రస్తుతం పెరిగిన 2.1 శాతం డీఏతో 52.8%కి చేరింది. మే 2024లో ఆర్పీఎస్-2017 అమలు తరువాత ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలు లేవు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎండీ నాగిరెడ్డిలు ఆర్టీసీ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. డీఏ ప్రకటించడం పట్ల మంత్రి పొన్నంను ఎండీ, ఇతర ఉన్నతాధికారులు అభినందించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆర్టీసీ ఉద్యోగికీ ఇది వర్తిస్తుందని, లైఫ్ లైన్‌గా ఉన్న ఆర్టీసీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లలా కృషి చేయాలని మంత్రి సూచించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్మికుల సంక్షేమమే తమ ప్రధాన ధ్యేయని ఎండీ నాగిరెడ్డి చెప్పారు. ఈ సమావేశంలో ఈడీలు సిహెచ్.వెంకన్న, ఖుస్రో షా ఖాన్, రాజశేఖర్, సాల్మన్, ఎఫఏ విజయపుష్ప, సీడీఎం శ్రీధర్, సీపీఎం ఉషాదేవి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




