ఆయిల్‌ ‌ఫామ్‌కు ఊతం… అన్నదాతకు అభయం

• రైతుకు ఆదాయం.. యువతకు ఉపాధి
• ఆయిల్‌ ‌ఫామ్‌ ‌రైతుకు ఆర్థిక భరోసా
• రూ.300కోట్లతో, 62 ఎకరాలో  పామాయిల్‌ ‌కర్మాగారం
• 2వేల మందికి ఉపాధి అవకాశాలు
• సిద్ధిపేట జిల్లాలో 50వేల ఎకరాలే లక్ష్యం
• నేడు నర్మెట్టలో పామాయిల్‌ ‌ఫ్యాక్టరీ పనులకు భూమిపూజ చేయనున్న మంత్రులు నిరంజన్‌రెడ్డి, హరీష్‌రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29: ‌రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌ ‌ఫామ్‌ ‌సాగును ప్రోత్సాహిస్తున్న నేపథ్యంలో సిద్ధిపేట జిల్లాలో 50వేల ఎకరాల ఆయిల్‌ ‌ఫామ్‌ ‌సాగుకు లక్ష్యంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఎప్పటికప్పుడు సాగుపై ప్రత్యేక దృష్టి సారించారు. గత రెండేళ్ల క్రితమే సాగుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే జిల్లాలో  3వేల మంది రైతులు 11 ఎకరాల్లో ఆయిల్‌ ‌ఫామ్‌ ‌సాగు చేస్తున్నారు. రైతుల సౌకర్యార్థం నంగునూర్‌ ‌మండలం నర్మెట్ట గ్రామంలో 62 ఎకరాల్లో 300 కోట్ల రూపాయలతో మంత్రి హరీష్‌ ‌రావు  చొరవతో ఆయిల్‌ ‌ఫెడ్‌ ఆధ్వర్యంలో  ఫామాయిల్‌ ‌కర్మాగారం ఏర్పాటు చేయనున్నారు. గత సంవత్సరంలోనే  ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేసారు. శనివారం పనుల ప్రారంభంకు భూమి పూజ మంత్రులు నిరంజన్‌రెడ్డి, హరీష్‌రావు  చేయనున్నారు. వరి, మొక్క జొన్న, పత్తి పంటలే తప్ప ప్రత్యామ్నాయం లేని ప్రాంతంగా ముద్ర పడిన సిద్దిపేట కొత్త శఖంకు నాంది పడింది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించే అవకాశం ఉన్న ఆయిల్‌ ‌ఫామ్‌ ‌తోటల సాగును జిల్లాలో ప్రోత్సాహిస్తున్న విషయం తెలిసిందే.  రైతుల్లో ఆత్మవిశ్వాసం కలిగించేందుకు ఈ ప్రాంతంలో నే ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మంత్రి హరీష్‌ ‌రావు  సంకల్పించుకున్నారు.

నిత్యం పర్యవేక్షణ చేస్తున్న మంత్రి హరీష్‌రావు..
కోనసీమగా సిద్ధిపేట..ఆయిల్‌ ‌ఫామ్‌ ‌సాగుకు ముందుకొస్తున్న రైతులు..

నాడు కరువు పీడిత ప్రాంతంగా ఉన్న సిద్దిపేట నేడు కల్పతరవుగా మారింది.. సాగు నీళ్లు లేని ప్రాంతం నేడు కోమసీమగా మారింది. ఎటు చూసినా చెరువులు,  చెక్‌ ‌డ్యామ్‌లు, కాలువలు కోనసీమను తలిపిస్తున్నాయి.  ఇది కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితం. రంగనాయక సాగర్‌, ‌కొండ పోచమ్మ, మలన్న సాగర్‌తో నేడు ఆనందం.. పచ్చని పొలాలతో పంటలు పరిడవిల్లుతున్నాయి. జిల్లాలో 50వేల ఎకరాల్లో ఆయిల్‌ ‌ఫామ్‌ ‌సాగుకు లక్యంగా మంత్రి హరీష్‌ ‌రావు  వ్యవసాయ, ఉద్యానవన అధికారులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ సమావేశాలు, కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ రైతుల్లో అవగాహన కల్పిస్తూ.. ఆత్మవిశ్వాసం నింపుతున్నారు. వచ్చే నాలుగేళ్లలో 50 వేల ఎకరాల్లో సాగుకు లక్ష్యంగా ముందుకు పోతున్నారు. 3వేల మంది రైతులు ఇప్పటికే 11 వేల ఎకరాల్లో ఆయిల్‌ ‌ఫామ్‌ ‌సాగు  పూర్తి చేసారు. ఈ ఏడాది 14 వేల ఎకరాల లక్ష్యంతో  ముందుకు పోతు ఇప్పటికే 3వేల ఎకరాల కు మొక్కలు నాటే లక్ష్యంగా డిడిలు కట్టి  సిద్ధంగా ఉన్నారు.  జిల్లాలో  ఉన్న మూడు నర్సరీ ల్లో 10లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. మరో 18 వేల ఎకరాలకు సరిపడా మొక్కలు సిద్దంగా ఉన్నాయి. మంత్రి హరీష్‌ ‌రావు చొరవతో రైతులు ఆయిల్‌ ‌ఫామ్‌ ‌సాగుకు ఉత్సహాన్ని చూపిస్తున్నారు.

నేడు పనులకు భూమి పూజ చేయనున్న మంత్రులు హరీష్‌రావు, నిరంజన్‌రెడ్డి
ఆయిల్‌ ‌ఫామ్‌కు ఊతం ఇచ్చేలా..అన్నదాతలకు అభయం అనేలా రైతులకు ఆదాయం, యువతకు ఉపాధి అవకాశాలు కలిపించే లక్ష్యం మంత్రి హరీష్‌ ‌రావు చొరవతో 300 కోట్ల రూపాయల పెట్టుబడితో  సిద్దిపేట జిల్లా నంగునూర్‌ ‌మండలం నర్మెటలో 62 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌ ‌ఫామ్‌ ‌కర్మాగారం ఏర్పాటు కానుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక  కొత్త జిల్లాలో తొలి ఆయిల్‌ ‌ఫామ్‌ ‌ఫ్యాక్టరీ సిద్దిపేటలోనే నిర్మాణం కానుంది.

ప్రస్తుతం  రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెంలో రెండు ఫ్యాక్టరీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణం చేశారు. గేలల నుండి ముడి నూనె తీసేయడంతో పాటు రెఫైండ్‌ అయిల్‌ను సైతం ఇక్కడే ఉత్పత్తి చేసేల ప్లాంట్లను తీర్చిదిద్దనున్నారు. ఒక సంవత్సర కాలంలో పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో  శనివారం రోజున మంత్రులు హరీష్‌రావు,, నిరంజన్‌రెడ్డి పనులకు భూమి పూజ చేయనున్నారు.  కాలుష్య రహిత ఫ్యాక్టరీగా తీర్చేదిద్దడానికి ప్రతిపాదనలు చేశారు. అంతేకాకుండా, ఈ పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థాలతో నిత్యం విద్యుత్‌ ఉత్పత్తి అయ్యేలా 4 మెగావాట్ల పవర్‌ ‌ప్లాంట్‌ను సైతం ఇక్కడ నిర్మించనున్నారు. సిద్దిపేటతో పాటు జనగామ, యాదాద్రి – భువనగిరి, కరీంనగర్‌, ‌సిరిసిల్లలో ఆయిల్‌ ‌ఫామ్‌ ‌సాగు చేసే రైతులు కూడా  గెలలను ఇక్కడికే తరలించనున్నారు. ఈ ఫ్యాక్టరీ పూర్తయితే 2వేల మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి.

అశ్వరావుపేటకు ఆయిల్‌ ‌ఫామ్‌ ‌సాగు సందర్శన..
ఆయిల్‌ ‌ఫామ్‌ ‌ప్రోత్సాహించే దిశగా మంత్రి హరీష్‌రావు  రైతులకు అవగహన, ఆత్మవిశ్వాసం పెంచేలా ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేటకు రైతులను పంపించారు. దాదాపు 100 గ్రామాలు, 2వేల మంది రైతులను సందర్శనకు పంపించారు. రైతుల్లో నమ్మకం పెరిగి ఆయిల్‌ ‌ఫామ్‌ ‌సాగుపై ఆసక్తి చూపారు.

 చాలా సంతోషంగా ఉంది: మంత్రి హరీష్‌రావు
గొప్ప సంతృప్తినిచ్చే సందర్భమని మంత్రి హరీష్‌రావు  అన్నారు. సిద్ధిపేట  ప్రాంతం ఎక్కడ ఉండే ఎక్కడికి వచ్చింది అని ఒక్కసారి ఉహించుకుంటేనే ఆశ్చర్యం వేస్తుందన్నారు. ఒకనాడు కరువు కటాకలు..బీడు భూములు ఉన్న ప్రాంతం నేడు కోనసీమను తలపించేలా మారిందనీ,  సిఎం  కేసీఆర్‌ ‌సహకారంతో ఆయిల్‌ ‌ఫామ్‌ ‌ఫ్యాక్టరీ సిద్దిపేటలో ఏర్పాటు కావడం గొప్ప సందర్భంగా గొప్ప పని చేసిన తృప్తి ఉందని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.  జిల్లా రైతులకు ఆయిల్‌ ‌ఫామ్‌ ‌సాగుతో ఎంతో మేలు, లాభం జరుగుతుందని, ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న రైతులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *